రిపబ్లిక్ డే ‘ట్రాక్టర్ ర్యాలీ’పై నిర్ణయం పోలీసులదే

రిపబ్లిక్ డే ‘ట్రాక్టర్ ర్యాలీ’పై నిర్ణయం పోలీసులదే
‘ట్రాక్టర్ ర్యాలీ’పై నిర్ణయం పోలీసులదే ‘ఫస్ట్ అథారిటీ’ మేం కాదు: సుప్రీంకోర్టు అది శాంతి భద్రతల  అంశమని కామెంట్రిటీ’ న్యూఢిల్లీ: రిపబ్లిక్ డే రోజున రైతులు నిర్వహించాలని నిర్ణయించిన ట్రాక్టర్ ర్యాలీ.. శాంతి భద్రతల అంశమని సుప్రీంకోర్టు కామెంట్ చేసింది. దేశ రాజధానిలోకి ఎవరిని అనుమతించాలో నిర్ణయించే మొదటి అధికారం ఢిల్లీ పోలీసులదేనని స్పష్టం చేసింది. ‘‘పోలీసుల అధికారాలేంటో, వాటిని ఎలా ఉపయోగించుకోవాలో సుప్రీంకోర్టు చెప్పాలా? ఏం చేయాలనేది మేం చెప్పబోం” అని చెప్పింది. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ బార్డర్లలో నిరసనలు తెలుపుతున్న రైతులు.. రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్​కు అంతరాయం కలిగించేందుకు ట్రాక్టర్ ర్యాలీ నిర్వహిస్తున్నారని, దాన్ని ఆపాలని ఆదేశాలివ్వాలని కోరుతూ ఢిల్లీ పోలీసుల ద్వారా కేంద్రం పిటిషన్ వేసింది. ఈ పిటిషన్​ను చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ ఎల్ఎన్ రావ్, జస్టిస్ వినీత్ సరన్​ల బెంచ్ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించింది. ‘‘ఢిల్లీలోకి ఎవరిని అనుమతించాలి, ఎవరిని అనుమతించకూడదు.. అనే దాన్ని పోలీసులు చూసుకోవాలి. ఇందులో ‘ఫస్ట్ అథారిటీ’ కోర్టు కాదు” అని స్పష్టం చేసింది. విచారణను బుధవారానికి వాయిదా వేస్తున్నామని చెప్పింది. దీనిపై రైతు సంఘాల నేతలు స్పందిస్తూ.. శాంతియుతంగా ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించే రాజ్యాంగపరమైన హక్కు తమకు ఉందన్నారు. 26న వేలాది మంది రైతులు ర్యాలీలో పాల్గొంటారని స్పష్టంచేశారు. For More News.. బైడెన్ ప్రమాణ స్వీకారానికి గతంలో ఎప్పుడూ లేనంత సెక్యురిటీ మహారాష్ట్ర – కర్నాటక బార్డర్ ఫైట్.. ఇంచు కూడా వదలమంటున్న కర్నాటక బార్డర్ దాటొచ్చి ఊరు కట్టిన చైనా ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిపైకి దూసుకెళ్లిన ట్రక్కు.. 13 మంది మృతి