సుప్రీం కోర్టులో జూనియర్ కోర్టు అటెండెంట్స్​

సుప్రీం కోర్టు ఆఫ్ ఇండియా (ఎస్‌‌‌‌‌‌‌‌సీఐ) ఖాళీగా ఉన్న 80 జూనియర్ కోర్టు అటెండెంట్ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్​ కోరుతోంది.

అర్హత: పదో తరగతి, పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయసు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. జీతం నెలకు రూ.46,210 చెల్లిస్తారు. రాత పరీక్ష, ప్రాక్టికల్ ట్రేడ్ స్కిల్ టెస్ట్‌‌‌‌‌‌‌‌, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​లో సెప్టెంబర్​ 12 వరకు దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్​ ఫీజు రూ.400; ఎస్సీ/ ఎస్టీ / ఎక్స్‌‌‌‌‌‌‌‌ సర్వీస్‌‌‌‌‌‌‌‌మెన్‌‌‌‌‌‌‌‌ / మహిళా/  దివ్యాంగ అభ్యర్థులకు రూ.200 చెల్లించాలి. వివరాలకు www.cdnbbsr.s3waas.gov.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.