పోస్టల్ బ్యాలెట్ వివాదం: వైసీపీకి షాకిచ్చిన సుప్రీం కోర్టు..

2024 సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ కి సమయం ముంచుకొస్తోంది. మరి కొన్ని గంటల్లో ప్రారంభం కానున్న కౌంటింగ్ కోసం ఎన్నికల సంఘం ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది. ఈ క్రమంలో పోస్టల్ బ్యాలెట్ పై ఈసీ ఇచ్చిన మార్గదర్శకాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది ఏపీ ప్రభుత్వం. ఈ అంశంపై హైకోర్టుకు వెళ్లిన ప్రభుత్వానికి చుక్కెదురైన సంగతి తెలిసిందే. తాజాగా హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది ఏపీ ప్రభుత్వం.

పోస్టల్ బ్యాలెట్ పై రిటానింగ్ అధికారి సంతకం ఉంటే సరిపోతుందని, సీల్, హోదా వంటివి వివరాలు పొందుపరచాల్సిన అవసరం లేదని తెలిపింది ఈసీ. కేవలం ఏపీకి మాత్రమే ఈ వెసలుబాటు కల్పించింది ఈసీ. దీన్ని వ్యతిరేకిస్తున్న ఏపీ సర్కార్ న్యాయపోరాటం చేస్తోంది.ఈ అంశంపై సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది ప్రభుత్వం.

ఈ పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం ఈ అంశంపై జోక్యం చేసుకోలేమని తెలిపింది. కౌంటింగ్ కి మరి కొన్ని గంటలు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో వచ్చిన సుప్రీం తీర్పు వైసీపీకి గట్టి షాక్ అనే చెప్పాలి. మరి, ఏపీ ఎన్నికల ఫలితాలపై నరాలు తెగే ఉత్కంఠ నెలకొన్న సమయంలో సుప్రీం తీర్పు ఏ మేరకు ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.