తెలంగాణ హైకోర్టు సీజే బదిలీకి సుప్రీంకోర్టు కొలిజీయం సిఫారసు

తెలంగాణ, బాంబే హై కోర్టు చీఫ్ జస్టిస్ లను  బదిలీ చేసేందుకు సుప్రీం కోర్టు కొలీజియం కేంద్రానికి సిఫారసు చేసింది.  తెలంగాణ  హైకోర్ట్ చీఫ్ జస్టిస్ గా ఉన్న జస్టిస్ అలోక్ అరాదేను బాంబే హైకోర్టుకు.. బాంబే హైకోర్టు చీఫ్ జస్టిస్ గా  ఉన్న దేవేంద్ర  కుమార్ ఉపాధ్యాయ్ ను ఢిల్లీ హైకోర్టుకు ట్రాన్స్ పర్ చేయాలని కొలిజీయం కేంద్రానికి  సిఫారసు చేసింది.  

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అలోక్ ఆరాధే 2024 జూలై 23న రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేశారు.తెలంగాణ హైకోర్టు ఏర్పాటైన తర్వాత 6 వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అలోక్ బాధ్యతలు చేపట్టారు.

ALSO READ | జనరల్​ స్టడీస్​​: ఎన్నికల సంఘం అధికారాలు ఏంటి.?