కోర్టులను ప్రజల దగ్గరికి చేరుస్తున్నం : డీవై చంద్రచూడ్

కోర్టులను ప్రజల దగ్గరికి చేరుస్తున్నం : డీవై చంద్రచూడ్

న్యూఢిల్లీ: కోర్టు రూమ్‌‌లను ప్రజల దగ్గరికి చేర్చేందుకు టెక్నాలజీని వాడుకుంటున్నామని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. ప్రొసీడింగ్స్‌‌ను ఆన్‌‌లైన్ స్ట్రీమింగ్ చేయడమనేది.. కోర్టును ప్రజల గుండెల్లోకి తీసుకెళ్లిందని చెప్పారు. ప్రతి ఒక్కరూ రాగలిగే స్థలంగా కోర్టులను మార్చడంలో భాగమే ఇదంతా అని పేర్కొన్నారు. అత్యంత శక్తివంతమైన ఆయుధం టెక్నాలజీ అని పేర్కొన్నారు. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ(నల్సా) నిర్వహించిన తొలి ‘రీజనల్ కాన్ఫరెన్స్ ఆన్ యాక్సెస్ టు లీగల్ ఎయిడ్’లో ఆయన మాట్లాడారు.

మారిషస్‌‌ సుప్రీంకోర్టును స్థాపించడంలో భారతదేశం కీలక పాత్ర పోషించింది. ఇటీవల సింగపూర్ సుప్రీంకోర్టుతో మన దేశం ఒక ఎంవోయూపై సంతకం చేసింది” అని వివరించారు. మన దేశంలో తక్కువ ప్రాతినిధ్యం ఉన్న జనాభాకు న్యాయ అవసరాలను విస్తరించడం అత్యవసరమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌‌కర్, కేంద్ర న్యాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, జీ20 షెర్పా అమితాబ్ కాంత్, సుప్రీం జడ్జిలు జస్టిస్ ఎస్‌‌కే కౌల్, జస్టిస్ సంజీవ్ ఖన్నా తదితరులు పాల్గొన్నారు.