బొప్పాయి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పలు అధ్యయనాల ప్రకారం, బొప్పాయిలో అనేక రకాల పోషకాలుంటాయి. ఇది అనేక తీవ్రమైన వ్యాధుల నుండి శరీరాన్ని రక్షించడంలో సహాయపడుతుంది. డైటీషియన్ల ప్రకారం, ఇప్పటికే కొన్ని వ్యాధులతో బాధపడుతుంటే, బొప్పాయిని క్రమం తప్పకుండా తీసుకోవడం చాలా మంచిది. ఇందులో అధిక మొత్తంలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది అనేక రకాల తీవ్రమైన వ్యాధులు, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించడంలో సహాయపడుతుంది. ఏంజెల్ ఫ్రూట్ గా పిలుచుకునే ఈ పండులో కార్బోహైడ్రేట్లు, ఫైబర్, ప్రోటీన్, విటమిన్ సి, ఎ, బి9, పొటాషియం, మెగ్నీషియం వంటివి ఉంటాయి. దీంతో పాటు కాల్షియం, విటమిన్ బి1, బి3, బి5, ఇ, కె వంటి పోషకాలు కూడా ఇందులో లభిస్తాయి. బొప్పాయిని తీసుకోవడం వల్ల కడుపు, జీర్ణవ్యవస్థ, చర్మపు రంగును మెరుగుపరచడం, ఆస్తమా వంటి దీర్ఘకాలిక వ్యాధుల చికిత్సలో ప్రయోజనకరంగా ఉంటుంది. బొప్పాయి తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
బొప్పాయి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు
1. మధుమేహం కోసం బొప్పాయి
డయాబెటిక్ పేషెంట్స్ తమ ఆహారపు అలవాట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. డయాబెటిక్ రోగులి బొప్పాయి తీసుకోవడం చాలా మంచి ఎంపిక. పలు అధ్యయనాల ప్రకారం, టైప్-1 మధుమేహ రోగులు అధిక ఫైబర్ ఉండే ఆహారం తీసుకోవాలి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించవచ్చు. బొప్పాయిలో పెద్ద మొత్తంలో పీచు ఉంటుంది.
2. క్యాన్సర్ రిస్క్ తగ్గిస్తుంది
నిపుణుల అభిప్రాయం ప్రకారం, బొప్పాయిలో లైకోపీన్ సమ్మేళనం ఉంటుంది. ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. క్యాన్సర్ కు చికిత్స పొందుతున్న రోగులకు బొప్పాయి తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. అంతే కాకుండా బొప్పాయిలో యాంటీ ఆక్సిడెంట్ బీటా కెరోటిన్ కూడా ఉంటుంది. బీటా కెరోటిన్తో కూడిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల యువకులలో ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
3. బలమైన ఎముకలు
బొప్పాయి తినడం వల్ల ఎముకలు దృఢంగా తయారవుతాయి. బొప్పాయి శరీరంలో విటమిన్ సి లోపాన్ని తొలగిస్తుంది. విటమిన్ సి లోపం ఎముక పగుళ్ల ప్రమాదాన్ని పెంచుతుంది. బొప్పాయిలో పెద్ద మొత్తంలో విటమిన్ కె, కాల్షియం కూడా ఉన్నాయి.
4. వయస్సు సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం
శరీరంలో మలబద్ధకం సమస్య ఉంటే బొప్పాయిని రోజూ తినాలి. దీంతో పొట్ట శుభ్రంగా ఉంటుంది. కడుపు నొప్పి, మలబద్ధకం నివారణకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది. ఇది చర్మాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే బొప్పాయిని తినాలి. ఈ పండు శరీరంలో నీటి లోపాన్ని కూడా తొలగిస్తుంది.
5. జీర్ణశక్తిని బలోపేతం చేయడానికి
మీరు జీర్ణ సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్టయితే రోజూవారి ఆహారంలో బొప్పాయిని చేర్చుకోవచ్చు. ఇందులో ఉండే పాపైన్ అనే ఎంజైమ్ ప్రొటీన్లను సులభంగా జీర్ణం చేయడంలో సహాయపడుతుంది.
6. జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి
స్కాల్ప్, హెయిర్ టిష్యూ పెరగడానికి బొప్పాయిని తీసుకోవచ్చు. బొప్పాయిలో విటమిన్ ఎ.. సెబమ్ ఉత్పత్తికి అవసరమైన పోషకాలలో ఒకటి. సెబమ్ జుట్టు తేమను నిర్వహించడానికి సహాయపడుతుంది.
7. చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే
బొప్పాయి చర్మం ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని నివారించడంలో సహాయకరంగా పరిగణించబడుతుంది. అంతే కాదు, ముడతలు, ఫైన్ లైన్స్ మొదలైన సమస్యలను నివారించడంలో కూడా ఈ పండు సహాయపడుతుంది.