అభిమానులారా క్షమించండి.. నేను పార్టీ పెట్టడం లేదు

అభిమానులారా క్షమించండి.. నేను పార్టీ పెట్టడం లేదు
డిసెంబర్ 31న తన కొత్త పార్టీ పేరు ప్రకటిస్తానని చెప్పిన సూపర్ స్టార్ రజినీకాంత్ వెనక్కి తగ్గారు. ఆరోగ్య సమస్యల దృష్ట్యా ప్రస్తుతం పార్టీ పెట్టే ఆలోచనను విరమించుకుంటున్నట్లు ఆయన ట్వీట్ చేశారు. అభిమానులందరూ తనను క్షమించాలని ఆయన కోరారు. తమిళనాడులో మరో అయిదు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో.. ఆయన కొత్త పార్టీ పెట్టి.. ఎన్నికల్లో పోటీచేయాలని అనుకున్నారు. కానీ, ఆయన ఆరోగ్యం సరిగా లేకపోవడంవల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకపోయినా.. ప్రజలకు మాత్రం సేవ చేస్తానని ఆయన అన్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆయన తన ట్విట్టర్ ఖాతాలో మూడు పేజీల లేఖను పోస్టు చేశారు. రజినీకాంత్ గత శుక్రవారం బీపీ పెరగడంతో హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చేరారు. రెండు రోజులు చికిత్స తీసుకున్న తర్వాత చెన్నైకి వెళ్లారు. ఆయన ఆరోగ్యం దృష్ట్యా రాజకీయాలకు దూరంగా ఉండాలని ఆయన కూతుళ్లు కోరడంతో రజినీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. For More News.. న్యూఇయర్ పార్టీకి డబ్బులివ్వలేదని నానమ్మను చంపిన మనవడు భారత్‌లో ఆరు కొత్త స్ట్రెయిన్ కేసులు.. హైదరాబాద్‌లో రెండు.. మనసుకు నచ్చని వాడితో కాపురం చేయలేను.. 16 రోజులకే సూసైడ్ చేసుకున్న నవవధువు