సూపర్ డాగ్..ఐదో అంతస్తు నుంచి దూకినా ఏం కాలేదు..

సూపర్ డాగ్..ఐదో అంతస్తు నుంచి దూకినా ఏం కాలేదు..

మనిషి అయినా..జంతువు అయినా..ఒక్క ఫ్లోర్ నుంచి దూకితే స్వల్ప గాయాలు అవుతాయి. రెండు లేదా మూడో ఫ్లోర్ నుంచి దూకితే కాళ్లు, చేతులు విరుగుతాయి. ఇక ఐదో అంతస్తు నుంచి దూకితే మాత్రం ఖచ్చితంగా ప్రాణాలు పోతాయి. కానీ ఓ కుక్క ఐదో అంతస్తు నుంచి దూకినా ఏం కాలేదు. చిన్న గాయం కూడా అవ్వలేదు. దూకిన తర్వాత ఆ కుక్క ధర్జాగా పరిగెత్తుకుంటూ వెళ్లింది. ప్రస్తుతం ఈ కుక్కకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

ఎలా దూకిందంటే..

ఓ కుక్క నిర్మాణంలో  ఉన్న ఐదో అంతస్తులో నిలబడి ఉంది. అటు ఇటు చూసింది. కొన్ని సెకన్ల తర్వాత కిందకు దూకేసింది. కిందకు దూకింది. కింద ఉన్న గోడకు కాళ్లను సపోర్ట్ చేసుకుంటూ కిందకు దూకేసింది. ఆ తర్వాత వెంటనే లేచి పరిగెత్తుకుంటూ వెళ్లిపోయింది. కిందకు దూకిన సమయంలో కానీ..దూకిన తర్వాత కానీ..కుక్కకు ఎలాంటి గాయాలు కాలేదు. 

వాహ్వా సాహసానికి సలాం..

ఐదో అంతస్తు నుంచి దూకిన కుక్క సాహసంపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ కుక్క సాహసాన్ని , ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు.