2024 ఎన్నికలు సంపిస్తున్న సమయంలో ఏపీలో రాజకీయం రోజురోజుకీ వేడెక్కుతోంది. ముఖ్యంగా కడప జిల్లాలో ఈ వేడి తీవ్రంగా ఉంది. జిల్లా రాజకీయం వివేకానంద రెడ్డి హత్య చుట్టూ తిరుగుతోంది. చిన్నాన్నను హత్య చేసినవారికి ఎంపీ టికెట్ ఇచ్చారంటూ షర్మిల జగన్, అవినాష్ లపై ప్రత్యక్షంగా విమర్శలు చేస్తున్న క్రమంలో వివేకానంద రెడ్డి కూతురు సునీత కూడా జగన్, అవినాష్ రెడ్డిలను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఓ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు సునీత.
ఎంపీగా అవినాష్ ఓడిపోవాలని, సీఎంగా జగన్ దిగిపోవాలన్నదే తన టార్గెట్ అని అన్నారు. అవినాష్ ఎంపీగా పోటీ చేయటం వివేకానంద రెడ్డికి ఇష్టం లేకపోయినా అప్పట్లో కుటుంబం కోసం అలోచించి మద్దతు ఇచ్చారని అన్నారు. తన పోరాటం న్యాయం కోసమే అని, పగబట్టే దాన్ని అప్పుడే కత్తి పట్టేదాన్నని అన్నారు సునీత. హత్యలు చేయించే వారి పవర్ తీసేస్తేనే బాధితులకు న్యాయ్యం జరుగుతుందని అన్నారు.