ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కడప జిల్లా రాజకీయం వివేకానంద రెడ్డి హత్య చుట్టూ తిరుగుతోంది. చిన్నాన్నను హత్య చేసినవారికి ఎంపీ టికెట్ ఇచ్చారంటూ షర్మిల జగన్, అవినాష్ లపై ప్రత్యక్షంగా విమర్శలు చేస్తున్న క్రమంలో వివేకానంద రెడ్డి కూతురు సునీత కూడా జగన్, అవినాష్ రెడ్డిలను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఓ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు సునీత.
షర్మిలకు మంచి పేరొస్తుందనే జగన్ పక్కన పెట్టారని అన్నారు. షర్మిలను పక్కన పెట్టి అవినాష్ కు టికెట్ ఇవ్వద్దని వివేకా పట్టుబట్టారని అన్నారు. అవినాష్ రెడ్దకి ఎంపీ టికెట్ ఇవ్వటం వివేకాకు ఇష్టం లేకపోయినా కుటుంబంలో చీలిక రాకూడదని, అతని గెలుపు కోసం పని చేశారని అన్నారు. చనిపోయే ముందురోజు కూడా ఎన్నికల ప్రచారంలో జగన్, అవినాష్ రెడ్డిల గెలుపు కోసం పని చేశారని అన్నారు. పులివెందులలో హత్యలు లేకుండా చేయాలని చూస్తున్న సమయంలో వివేకాను చంపేసారని అన్నారు