అమెరికా ఎలక్షన్‌లో అంతరిక్షం నుంచే ఓటు! : ISS నుంచి మాట్లాడిన సునీతా విలియమ్స్

సునీతా విలియమ్స్‌, విల్‌మోర్‌ శనివారం స్పేస్‌ నుంచి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. అంతరిక్ష కేంద్రంలో ఉండటాన్ని ఎప్పుడూ ఆస్వాదిస్తానన్నారు.. అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్. సహచర వ్యోమగామి బుచ్ విల్మోర్ తో కలిసి ISS నుంచి మాట్లాడారు. భూమి పైకి చేరడానికి ఆలస్యమవడంపై ఎలాంటి ఆందోళన చెందవద్దన్నారు ఆమె. నవంబర్‌లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఐఎస్‌ఎస్‌ నుంచే ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎదురుచూస్తున్నట్లు సునీతా చెప్పారు. 

ALSO READ | కమల వర్సెస్ ట్రంప్.. డిబేట్‎పై పోల్స్‎లో అమెరికన్లు ఎవరివైపు మొగ్గు చూపారంటే..?

అమెరికా పౌరులుగా ఓటు హక్కు వినియోగించుకోవడం తమ కర్తవ్యమన్నారు. బ్యాలెట్‌ కోసం తమ అభ్యర్థనను నాసాకు పంపామని.. ఇందుకు నాసా సహకరిస్తుందని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. వ్యోమనౌక బోయింగ్ స్టార్ లైనర్ సాంకేతిక సమస్యతో.. సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్ లను ఐఎస్ఎస్ లోనే వదిలేసి భూమికి చేరింది. దీంతో సునితా విలియమ్స్ ఫిబ్రవరిలో భూమికి చేరే అవకాశం ఉంది. 

ALSO READ | ప్రపంచంలోనే తొలిసారి ప్రైవేట్ స్పేస్ వాక్!

బోయింగ్‌ సంస్థ ఈ ఏడాది జూన్‌లో చేపట్టిన స్టార్‌లైనర్‌ స్పేస్‌ మిషన్‌ ద్వారా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్‌ విల్‌మోర్‌ ఐఎస్‌ఎస్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. అయితే తిరుగు ప్రయాణంలో బోయింగ్‌ స్టార్‌లైనర్‌లో సాంకేతిక లోపం తలెత్తటంతో వ్యోమగాములు అంతరక్షింలోనే ఉండిపోవాల్సి వచ్చింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకూ వారిద్దరూ అంతరిక్షంలోనే ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.