Horoscope : తులా సంక్రమణం.. తులా సంక్రాంతి.. 12 రాశులపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది..!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవ గ్రహాలు.. వాటి సంచారం... ఏ గ్రహం .. ఏరాశిలో  ఉంది.. దానిని బట్టి  మానవుల జీవితంలో మంచి.. చెడులు ఉంటాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.  నవగ్రహాలకు అధి దేవత సూర్యుడు....అక్టోబర్ 17వతేదీన ఉదయంం 7.47 గంటలకు  సూర్యుడు  కన్యారాశినుంచి తులా రాశిలోకి ప్రవేశించాడు.  నవంబర్​ 16 వరకు ఇదేరాశిలో సూర్యుడు ఉంటాడు.  తులారాశిలో  సూర్య సంచారం ఏ రాశి వారికి ఎలా ఉందో  తెలుసుకుందాం.

మేషరాశి:  సూర్యుడు తులారాశిలో సంచారం వలన మేషరాశి వారికి అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది.  స్నేహితులు, ఉన్నతాధికారుల మద్దతు ఉంటుంది.  కార్యాలయం నుంచి ప్రశంసలు వచ్చే అవకాశం ఉంది.  వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి.  ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. కెరీర్​లో ప్రమోషన్ పొందే అవకాశం ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు బలపడి .. కుటుంబంలో శాంతి.. ఆనందం ఉంటాయి.  విదేశీ ప్రయాణం చేయాలనుకునే వారికి ఇది అనుకూలమైన సమయం.  

వృషభరాశి:  తులారాశిలో సూర్యుడు సంచారం వలన  వృషభరాశి వారికి అదృష్టం కలసివస్తుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.  వీరి ఆదాయం క్రమేణ పెరుగుతుంది. విద్యార్థులకు ఇది అనుకూలమైన సమయం.  ప్రేమ వ్యవహారాలు కలసివస్తాయి. ఉద్యోగులకు అనుకూలంగా ఉండి.. అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు.  వ్యాపారులకు అనుకోకుండా లాభాలు వస్తాయి.  కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.  

మిథునరాశి: సూర్యుడు తులారాశిలో ఉండటం వలన మిథున రాశి జాతకులు తీర్థయాత్రలు చేసే అవకాశాలున్నాయి,  ఉద్యోగంలో ఆనందం .. సంతృప్తి కలుగుతాయి.  షేర్​లు కొనుగోలు చేసేవారికి ఊహించని లాభాలు వస్తాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.   ఆర్థిక విషయంలో ఎలాంటి మార్పులు ఉండవు.  విదేశీ ప్రయాణాలు చేయకపోవడమే మంచిదని పండితులు సూచిస్తన్నారు.  ప్రేమ వ్యవహారాలు కొంత కాలం వాయిదా వేసుకోవడం ఉత్తమం.  ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎవరితోనూ వాదనలు పెట్టుకోవద్దని పండితులు సూచిస్తున్నారు.

కర్కాటక రాశి:  తులారాశిలో  సూర్యుడు సంచారం వలన కర్కాటక రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి.  కేరీర్​ పరంగా కొన్ని సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుంది.  ఆర్థిక ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. దుబారా ఖర్చులను తగ్గించుకోవాలని పండితులు సూచిస్తున్నారు.  ప్రేమ వ్యవహారాలకు ఇది అనుకూలమూన సమయం కాదు..కుటుంబ సమస్యలు.. వ్యక్తిగత ఆందోళనకు దారితీసే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.  ఆరోగ్య పరంగా సమస్యలు ఉండే అవకాశం ఉన్నందున... పరమేశ్వరుడికి మహారుద్రాభిషేకం చేయండి.. ప్రశాంతంగా ఉండి.. ఏ విషయాన్నైనా ఒకటికి .. రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి.. వ్యూహాత్మక ప్రణాళిక వలన అంతా మంచే జరుగుతుంది. 

Also Read :- విశాఖలో అంతర్జాతీయ బెట్టింగ్ యాప్ ముఠా

సింహరాశి: తులారాశిలోసూర్య గ్రహ సంచారం... సింహ రాశి వారికి వ్యక్తిగత విజయాలుంటాయి.  కేరీర్​ పరంగా ఒత్తిళ్లు ఉన్నా.. వాటిని మీ వాక్​ చాతుర్యంతో అధిగమిస్తారు.  వ్యాపారంలో లాభాలు ఉంటాయి.  కొన్ని కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుంది.  విదేశీ ప్రయాణాలు వాయిదా వేసుకోండి. ఆరోగ్య విషయంలో చర్మ సంబంధమైన వ్యాధులు తలెత్తే అవకాశం ఉంటుంది. ఆర్ధికంగా ఎలాంటి మార్పులు ఉండవు.

కన్యారాశి:  సూర్యుడు .. తులారాశిలో సంచారం వలన ఉద్యోగంలో మార్పు వచ్చే అవకాశం ఉంటుంది.  విదేశీ ప్రయాణాలు అంతగా కలసిరావు.  ఉమ్మడి ఆస్థి వ్యవహారంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఏ విషయాన్నైనా కొంత గోప్యత(సీక్రెట్​) పాటించండి.  వ్యాపారస్తుల విషయంలో ఎలాంటి మార్పులు ఉండవు.  ప్రతి రోజు సూర్యాష్టకం పఠించండి.  ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం పొందుతారని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. 

తులా రాశి: ఇదే రాశిలో సూర్యుడు నవంబర్​ 16 వరకు ఉంటాడు.  ఈ కాలం తులారాశివారికి చాలా అనుకూలంగా ఉంటుంది.  గత అనుభవాల రీత్యా ఉద్యోగ.. వ్యాపార రంగాల్లో మంచి నిర్ణయాలు తీసుకుంటారు.  కొత్త వ్యాపారాలు ప్రారంభించేందుకు అనుకూలమైన సమయం.. ఆర్థిక పురోభివృద్దితో పాటు సమాజంలో గౌరవం లభిస్తుంది.  కెరీర్​ పరంగా ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది.  ఇప్పటికే ప్రేమలో ఉన్నట్లయితే .. వివాహానికి దారితీసే అవకాశం ఉంది. విదేశీ ప్రయాణాలు కలసి వస్తాయి.   ఆరోగ్యం విషయంలో ఎలాంటి మార్పులు ఉండవు. 


వృశ్చిక రాశి: తులారాశిలో సూర్యుని సంచార సమయంలో ఉద్యోగ పరంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంది.  సహోద్యోగులతో చాలా జాగ్రత్తగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు. వ్యాపారస్తులు అప్రమత్తంగా ఉండాలి.  ప్రేమ అనే పదానికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. కుటుంబసభ్యులతో అభిప్రాయ బేధాలు వచ్చే అవకాశం ఉంది.  కొంత అదనపు ఖర్చులు పెట్టాల్సి రావడంతో ఆర్ధికంగా కొన్ని ఒడుదుడుకులు ఉంటాయి.  వాహనం డ్రైవింగ్​ చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండంది. 

ధనస్సు రాశి: సూర్యుడు తులారాశిలో సంచారం వలన దనస్సు రాశి వారికి సామాన్య ఫలితాలు ఉంటాయి.  మీరు అనుకున్న లక్ష్యాలను సాధించడానికి కొంత కష్టపడాల్సి ఉంటుంది.  ఉద్యోగస్తులు... ఉన్నతాధికారులనుంచి ప్రశంశలు పొందుతారు.  కెరీర్​ పరంగా ఎలాంటి మార్పులు ఉండవు,  వ్యాపార రంగంలో అమితమైన లాభాలుంటాయి.  ఆర్ధికపరంగా పురోగతి ఉంటుంది.  ప్రేమ విషయంలో సానుకూల ఫలితాలుంటాయి. ఆరోగ్య పరంగా ఎలాంటి మార్పులు ఉండవు. ఆఫీసులో, ఇంట్లో అన్ని విషయాలు అనుకూలంగా ఉంటాయి.

మకరరాశి:   తులారాశిలో .... సూర్యుడు  సంచారంవలన మకర రాశి వారు వివాదాస్పద పరిస్థితులకు దూరంగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు.  కెరీర్​ విషయంలో వచ్చిన అవకాశాలు చివరి నిమిషంలో చేజారిపోయే అవకాశం ఉంది.  కొంత డబ్బు వృధాగా ఖర్చయ్యే అవకాశం ఉంటుంది.   ఉద్యోగస్తుల విషయంలో ఎలాంటి మార్పులు ఉండవు.  ఇక వ్యాపారస్తులు కొంత అధికంగా శ్రమ చేయవలసి ఉంటుంది.  ఆర్థిక పరంగా కొన్ని ఇబ్బందులు వచ్చినా.. తట్టుకునే శక్తి ఉంటుంది.  ప్రేమ వ్యవహారంలో ఆచితూచి నిర్ణయం తీసుకోండి. 

కుంభరాశి: ఈ రాశి వారికి తులారాశిలో  సూర్యుని సంచారం బాగా కలసి వస్తుంది. వృత్తి వ్యాపారాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది.  ప్రమోషన్ వచ్చి జీతం పెరిగే అవకాశం ఉంటుంది.  వ్యాపారస్తులు ఇది అనుకూలమైన సమయం. విదేశీ ప్రయాణాలుకలిసి వస్తాయి.  ఆరోగ్యంగా ఫిట్​నెస్​ కలిగి ఉంటారు. ప్రేమ వ్యవహారం పెళ్లిరి దారితీసే అవకాశం ఉంది. సమాజంలో కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి. దైవచింతనలో గడపడం వలన అంతా మంచే జరుగుతుంది. 

మీన రాశి:  ఈ రాశి వారికి తులారాశిలో  సూర్యుని సంచారంతో  అనుకోకుండా  ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. లోన్​ కోసం ఎదురు చూసే వారు శుభవార్త వింటారు. ఉద్యోగస్తుల విషయంలో ఎలాంటి మార్చు ఉండదు.  వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలుంటాయి. డబ్బు ఖర్చుచేసేటప్పుడు ఆలోచించండి .  విదేశీ ప్రయాణాలు.. విదేశీ ప్రేమకు అనుకూలమైన సమయం. ఆదిత్యహృదయం పఠించండి.