ఆస్ట్రేలియన్‌‌ ఓపెన్‌‌ బరిలో సుమిత్‌‌ నగాల్‌‌

ఆస్ట్రేలియన్‌‌ ఓపెన్‌‌ బరిలో సుమిత్‌‌ నగాల్‌‌
న్యూఢిల్లీ : ఇండియా టెన్నిస్‌‌ యంగ్‌‌ సెన్సేషన్‌‌ సుమిత్‌‌ నగాల్‌‌(23) ఆస్ట్రేలియన్‌‌ ఓపెన్‌‌ 2021కు వైల్డ్‌‌ కార్డు ఎంట్రీ దక్కించుకున్నాడు. మెన్స్‌‌ సింగిల్స్‌‌  మెయిన్‌‌ డ్రాలో నేరుగా బరిలోకి దిగనున్నాడు. ఏసియా–పసిఫిక్‌‌ రీజియన్‌‌కు రిజర్వ్‌‌ చేసిన ఏకైక వైల్డ్‌‌కార్డ్‌‌ నగాల్‌‌కు దక్కింది. ఆస్ట్రేలియన్‌‌ ఓపెన్‌‌లో బరిలోకి దిగుతుండటంపై  136వ ర్యాంకర్‌‌ నగాల్‌‌ సంతోషం వ్యక్తం చేశాడు. తనకు వైల్డ్‌‌ కార్డు వెంట్రీ దక్కడం వెనుక ఉన్న వారికి రుణిపడి ఉంటానని తెలిపాడు. కరోనా ముప్పు ఉన్న ఈ పరిస్థితుల్లోనూ గ్రాండ్‌‌స్లామ్‌‌కు ఏర్పాట్లు చేస్తున్న నిర్వాహకులకు థ్యాంక్స్‌‌ చెప్పాడు.  వచ్చే ఏడాది ఫిబ్రవరి 8 –21 తేదీల్లో ఆస్ట్రేలియన్‌‌ ఓపెన్‌‌ జరగనుంది.