క‌ృష్ణ మందిరాన్ని ఆనుకొని ఉన్న ఈద్గాను తొలగించాలి

క‌ృష్ణ మందిరాన్ని ఆనుకొని ఉన్న ఈద్గాను తొలగించాలి

మధుర: దశాబ్దాల పోరాటం తర్వాత అయోధ్యలో రామ మందిర నిర్మాణం మొదలైన సంగతి తెలిసిందే. ప్రధాని మోడీ చేతుల మీదుగా రామాలయ భూమి పూజ జరిగింది. ఈ నేపథ్యంలో మరో వివాదం తెర పైకి వస్తోంది. ఈసారి ఉత్తర్ ప్రదేశ్, మధురలోని శ్రీ కృష్ణ మందిరానికి ఆనుకొని ఉన్న షాహీ ఈద్గాను తొలగించాలని మధుర సివిల్ కోర్టులో వ్యాజ్యం దాఖలైంది. బాలదేవత భగవాన్ శ్రీ కృష్ణ విరాజ్మాన్ ట్రస్టు సభ్యురాలు రంజనా అగ్నిహోత్రి వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. యూపీ సున్నీ వక్ఫ్ బోర్డు, షాహీ ఈద్గా ట్రస్ట్ మేనేజ్‌‌మెంట్ కమిటీని దీంట్లో ప్రతివాదులుగా చేర్చారు. వ్యాజ్యం ప్రకారం ఆలయానికి చెందిన 13.37 ఎకరాల భూమిని తిరిగి అప్పగించాలి. షాహీ ఈద్గా ట్రస్టు కొందరు ముస్లింల సాయంతో శ్రీ కృష్ణ జన్మస్థాన్ ట్రస్ట్‌కు చెందిన భూమిని ఆక్రమించి, ఒక నిర్మాణాన్ని ఏర్పాటు చేసిందని దావా పేర్కొంది. అదే సమయంలో ఈద్గా ట్రస్టుతో ఆలయ గవర్నింగ్ బాడీ అయిన శ్రీ కృష్ణ జన్మస్థాన్ సేవా సంస్థాన్‌‌ కుమ్మకై భూమిని మోసపూరితంగా రాజీ పడి అంగీకరించిందని దావా వివరించింది.