హైదరాబాద్లో విద్యార్థిని ఆత్మహత్యయత్నం..పరిస్థితి విషమం

హైదరాబాద్ ఇంటర్ చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది.ఆర్కే పురం గ్రీన్ హిల్స్ లోని శ్రీచైతన్య జూనియర్ కాలేజీలో బైపీసీ సెకండ్ఇయర్ చదువుతున్న వేణుశ్రీ హాస్టల్ గదిలో ఉరివేసుకుంది. తోటి విద్యార్ధులు గమనించి ఉరి తొలగించి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం చెదురుబావికి చెందిన వేణుశ్రీ.. కళాశాల యాజమాన్యం వేధింపులవల్లే ఆత్మహత్యాయత్నం చేసిందని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. కాలేజీ యాజమాన్యం సమాధానం చెప్పాలని బంధువులు ఆందోళన చేశారు.