మాడ్గుల్ మండలంలో.. రూ.5 లక్షలు పలికిన దుర్గామాత లడ్డు

ఆమనగల్లు, వెలుగు: మాడ్గుల్  మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన దుర్గామాత లడ్డు రూ.5,02,116 పలికింది. ఆదివారం రాత్రి నిర్వహించిన వేలంలో మండల కేంద్రానికి చెందిన సూదిని పట్టాభి నారాయణరెడ్డి లడ్డూను దక్కించుకున్నారు. అమ్మవారి కలశం, ప్రతిమను రూ.1,41,116లకు మసున విష్ణు, ముక్కుపుడకను రూ.1,21,116లకు వల్లపు విజయ్ కుమార్, లక్ష్మీమాలను రూ.1,00,116లకు వరికుప్పల శేఖర్  దక్కించుకున్నారు. 

అనంతరం అమ్మవారి శోభాయాత్ర నిర్వహించారు. కడ్తాల్  మండలం ఎక్వాయిపల్లి గ్రామంలో ఫ్రెండ్స్  యూత్  ఆధ్వర్యంలో ప్రతిష్టించిన దుర్గామాత నిమజ్జనాన్ని ఆదివారం రాత్రి నిర్వహించారు. అంతకుముందు నిర్వహించిన వేలంలో అమ్మవారి ముక్కుపుడకను రూ.1.31 లక్షలకు ఆంజనేయులు గౌడ్, లడ్డూను రూ.85 వేలకు యాదయ్య గౌడ్, లక్ష్మీమాలను రూ.50 వేలకు మల్లేశ్ గౌడ్, పెద్ద చీరను రూ.31 వేలకు లక్ష్మణ్, చిన్న చీరను రూ.24 వేలకు బాలరాజు దక్కించుకున్నారు. రవికాంత్ గౌడ్, వీరయ్య, ఉమాపతి, నరసింహ పాల్గొన్నారు.