పీవీపీ కంపెనీపై చర్యలు తీసుకోవాలి

గద్వాల, వెలుగు : మధ్యప్రదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన వలస కార్మికుడు విజయ్ కుమార్ సింగ్ మృతికి కారణమైన పీవీపీ కన్స్ట్రక్షన్ కంపెనీ పై చర్యలు తీసుకోవాలని పీడీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యూ జిల్లా అధ్యక్షుడు హలీం పాషా, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధికార ప్రతినిధి సుభాన్ డిమాండ్ చేశారు. మంగళవారం సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మృతి చెందిన కార్మికుడి కుటుంబానికి 

రూ. 50 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు.  కార్మికులకు కనీస సౌకర్యాలు లేవని మండిపడ్డారు.  ఎలాంటి పర్మిషన్ లేకుండా మైనింగ్, బ్లాస్టింగ్ చేస్తున్న పట్టించుకోకపోవడం ఏమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కార్యక్రమంలో రామ్ రెడ్డి, రాజేశ్, ఆంజనేయులు తదితరులు ఉన్నారు.