కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌లో గుండెపోటుతో సబ్ ట్రెజరీ ఆఫీసర్ మృతి

  • ఆఫీసులోనే కుప్పకూలిన ఉద్యోగి

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: మహబూబ్​నగర్ కలెక్టరేట్‌‌‌‌‌‌లో విషాదం చోటు చేసుకుంది. సోమవారం ఉదయం డ్యూటీకి వచ్చిన ఓ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు హార్ట్‌‌‌‌‌‌‌‌స్ట్రోక్ రావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. వనపర్తికి చెందిన టి.మోహన్ రాజు(54) మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్ జిల్లా ట్రెజరీ కార్యాలయంలో ఆరేండ్లుగా సబ్ ట్రెజరీ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బదిలీల్లో భాగంగా, ఆయన తన సొంత జిల్లా 

వనపర్తికి ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫర్ అయ్యారు. సోమవారమే బదిలీలకు సంబంధించి ఆర్డర్స్‌‌‌‌‌‌‌‌ వచ్చాయి. ఈ క్రమంలో ఉదయం మోహన్ రాజు కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌కు చేరుకొని, తన చాంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సమీపంలో నిలబడి ఉండగా, 9.16 గంటలకు గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయాడు. దీంతో తలకు తీవ్ర గాయం కావడంతో రక్తస్రావం జరిగింది. వెంటనే ఆఫీసు సిబ్బంది ఆయనను చికిత్స కోసం మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్ జనరల్ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌కు తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. కాగా, మోహన్ రాజు మృతి విషయం తెలుసుకున్న కలెక్టర్ విజయేంద్ర బోయి హాస్పిటల్‌‌‌‌‌‌‌‌కు వెళ్లి, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.