స్టూడెంట్లు కష్టపడి కలలు నిజం చేసుకోవాలి.. గవర్నర్‌ జిష్ణుదేవ్ వర్మ సూచన

మెదక్/కొల్చారం, వెలుగు: ఉన్నతమైన కలలు కని, పట్టుదలతో శ్రమించి వాటిని సాకారం చేసుకోవాలని గవర్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిష్ణుదేవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వర్మ స్టూడెంట్లకు సూచించారు. సమస్యలను చూసి భయపడి పారిపోవద్దన్నారు. మెదక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లా కొల్చారంలోని సోషల్‌ వెల్ఫేర్‌ గర్ల్స్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌‌‌ను ఆదివారం సందర్శించి విద్యార్థినులతో ముఖాముఖి నిర్వహించారు.

ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ స్టూడెంట్లందరూ బాగా చదువుకుని డాక్టర్లు, ఇంజినీర్లు, సైంటిస్టులు కావాలని ఆకాంక్షించారు. సమస్యలను అధిగమిస్తూ లక్ష్యాలను సాధించాలని పిలుపునిచ్చారు. బాలికలకు రెసిడెన్షియల్‌ స్కూల్స్  బంగారు భవిష్యత్‌ను ఇస్తాయన్నారు. క్రీడల్లో తన బ్యాడ్మింటన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇష్టమని, భారత మాజీ ఉపరాష్ట్రపతి డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణణ్‌ ఆదర్శమని చెప్పారు.

చదవడం, రాయడంపై తాను ఆసక్తి చూపుతానని, పుస్తకాలే తన నేస్తమన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పారు. మెదక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎంపీ రఘునందన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రావు మాట్లాడుతూ రెసిడెన్షియల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కూల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విద్యార్థుల అభ్యున్నతికి పాటుపడుతున్నాయన్నారు. కార్యక్రమంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత, గవర్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రిన్సిపల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెక్రటరీ దాన కిశోర్, కలెక్టర్‌‌ రాహుల్‌ రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎస్పీ ఉదయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, రెసిడెన్షియల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కూల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెక్రటరీ అలుగు వర్షిణి, అడిషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నగేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు. అంతకుముందు గవర్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు జిల్లా అధికారులు ఘన స్వాగతం పలిఆకరు.

మెదక్ చర్చి.. పవిత్ర వారసత్వ మందిరం
మెదక్‌ కేథడ్రల్‌ చర్చిని ఆదివారం గవర్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిష్ణుదేవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వర్మ సందర్శించారు. ఈ సందర్భంగా చర్చిలోని ప్రధాన వేదిక వద్ద ప్రిసిబిటరీ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి రెవరెండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శాంతయ్య, ఇతర గురువులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి గవర్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ చర్చి శతాబ్ది వేడుకలు ఒక మహత్తర ఘట్టమని, మెదక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చర్చి అనేక మందికి దైవకేంద్రంగా నిలిచిందన్నారు.