గద్వాలలో బస్సుల కోసం స్టూడెంట్ల నిరసన

గద్వాల టౌన్, వెలుగు: గద్వాల, రాయచూర్  రూట్లలో బస్సులు సరిగా నడపడం లేదని స్టూడెంట్లు బుధవారం సాయంత్రం నిరసన తెలిపారు. నాలుగు గంటల నుంచి బస్సులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పేర్కొంటూ, స్టూడెంట్లు పట్టణంలోని బస్టాండ్  ఎదురుగా నిరసన తెలిపారు. బస్సుల రాకపోకలను అడ్డుకున్నారు. సకాలంలో బస్సులు నడుపుతామని ఆర్టీసీ అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

మంత్రికి సురవరం లేఖ..

అలంపూర్: ఉండవెల్లి మండలంలోని గ్రామాలకు ఆర్టీసీ బస్​ సౌకర్యం కల్పించాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు  బుధవారం సీపీఐ మాజీ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉండవెల్లి మండలం కంచుపాడు గ్రామానికి ఉమ్మడి ఏపీలో కర్నూల్​ డిపో నుంచి బస్సులు వచ్చేవని, పదేండ్ల నుంచి ఆర్టీసీ బస్సులు రాక ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. చిన్నారులు విద్యకు దూరం కావాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. అలంపూర్ నియోజకవర్గంలోని గ్రామాలకు బస్సులు నడపాలని కోరారు.