అక్కన్నపేటలో బస్సుల కోసం స్టూడెంట్స్ రాస్తారోకో

రామాయంపేట, వెలుగు: మండలంలోని అక్కన్నపేటలో శుక్రవారం స్టూడెంట్స్ బస్సుల కోసం మెదక్,  రామాయంపేట రోడ్డుపై రాస్తారోకో చేశారు. బస్సులు సరిగ్గా  రాక కాలేజీ కి సరైన సమయంలో చేరుకోలేక బోధనకు దూరమవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అక్కన్నపేట, ఝాన్సీ లింగాపూర్, ఖాజాపూర్ గ్రామాల స్టూడెంట్స్​తరలివచ్చి రోడ్డుపై బైఠాయించి గంటపాటు రాస్తారోకో చేశారు. దీంతో ఇరు వైపులా ట్రాఫిక్ నిలిచిపోయింది. విషయం తెలుసుకున్న ఎస్ఐ బాలరాజు అక్కడకు చేరుకుని వారికి నచ్చచెప్పి ఆందోళన విరవింప చేయించారు.