స్కాలర్ షిప్​లు విద్యార్థుల హక్కు... సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట ధర్నా

మెదక్​టౌన్, వెలుగు: ప్రభుత్వం విద్యార్థులకు అందించే స్కాలర్​షిప్​లు వారికి ఇచ్చే భిక్ష కాదని అది విద్యార్థుల హక్కు అని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఉదయ్​కిరణ్​అన్నారు. పట్టణంలోని రాందాస్​ చౌరస్తాలో మంగళవారం పెండింగ్​లో ఉన్న రూ.7,500 కోట్ల స్కాలర్​షిప్​, ఫీజు రీయింబర్స్​మెంట్​బకాయిలు విడుదల చేయాలని డిమాండ్​ చేస్తూ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. 

సంగారెడ్డి టౌన్: పెండింగ్ లో ఉన్న స్కాలర్​షిప్​, ఫీజు రియింబర్స్​మెంట్​ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ  ఏబీవీపీ ఆధ్వర్యంలో  సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. జిల్లా కన్వీనర్ ఆకాశ్ మాట్లాడుతూ మూడేళ్లుగా విద్యార్థులకు స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్​మెంట్ చెల్లించకుండా ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.