ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు ధర్నా

జీవో 55 ని వెంటనే రద్దు చేయాలని ప్రొఫెసర్ జయశంకర్ విశ్వ విద్యాలయంలో విద్యార్థులు ధర్నాకు దిగారు. రిసెర్చ్ చేయడానికి భూములు లేకపోతే తాము ఎలా పరిశోధనలు చేస్తామని ప్రశ్నించారు. జీవోని రద్దు చేసే వరకు పరీక్షలు రాసే ప్రసక్తే లేదని హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయంలో  విద్యార్థుల ఆందోళన కొనసాగుతుంది. 

ఈరోజు 2023 ఫిబ్రవరి 2న పరీక్ష రాస్తున్న రెండోవ సంవత్సరం విద్యార్థులను ఆందోళన కారులు అడ్డుకున్నారు. దీంతో ఆందోళనకారులు, విద్యార్థుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. వ్యవసాయ విశ్వవిద్యాలయంకు విద్యార్థులు తాళాం వేశారు. దీంతో అక్కడ పరిస్థితి ఉధృతంగా మారింది. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు.