సార్ మా తండాకు రోడ్డు వేయించండి..!

నర్సాపూర్, వెలుగు : మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం పిల్లికుంట్ల తండా జీపీ పరిధిలోని జువ్వి పోచమ్మ తల్లి తండా రోడ్డు అధ్వానంగా మారింది. దీంతో స్టూడెంట్స్​స్కూలుకు వెళ్లేందుకు తిప్పలు పడుతున్నారు. 

తల్లి దండ్రులు బైక్ మీద దింపి వద్దమన్నా, ఆటోలో పంపిద్దామన్నా వీలు కాని పరిస్థితి ఉందని తండా వాసులు ఆరోపిస్తున్నారు. సోమవారం బురద రోడ్డు లో ఇబ్బందులు పడుతూ వెళ్తూ స్టూడెంట్స్​రోడ్డు వేయించాలని సీఎంని కోరిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ‌‌‌‌