- ట్రస్ట్ సేవలు అభినందనీయం
- మంత్రులు కృష్ణారావు, దామోదర, శ్రీధర్ బాబు
కొడంగల్, వెలుగు :28 వేల మంది విద్యార్థులకు నాణ్యమైన బ్రేక్ ఫాస్ట్అందించేందుకు ముందుకొచ్చిన హరే కృష్ణ మూమెంట్చారిటబుల్ట్రస్ట్ సేవలు అభినందనీయమని మంత్రులు జూపల్లి కృష్ణరావు, దామోదర రాజనర్సింహ, శ్రీధర్ బాబు అన్నారు. వికారాబాద్ జిల్లా కొడంగల్‌లో రూ.6.5 కోట్లతో నిర్మించిన సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్‌ను శుక్రవారం మంత్రులు ప్రారంభించారు. అనంతరం కొడంగల్ లో రూ. 76 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు టిఫిన్వడ్డించడంతో పాటు భోజనం చేశారు. మంత్రులు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్చొరవతో కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ స్కూళ్లలో విద్యా ప్రమాణాలు మెరుగయ్యాయని పేర్కొన్నారు. రాష్ర్టంలో మరిన్ని సెంట్రలైజ్డ్కిచెన్ లు ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేసి రైతాంగాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
కొడంగల్‌లో నిర్మించిన సెంట్రలైజ్డ్కిచెన్దేశంలోనే పెద్దదని హరే కృష్ణ మూమెంట్ట్రస్ట్ ఫౌండర్సత్యగౌర చంద్రదాస్ ప్రభూజీ తెలిపారు. కిచెన్ నిర్మాణానికి సహకరించిన వయాట్రిస్హెడ్మిచెల్డొమినికాకు కృతజ్ఞతలు తెలిపారు. స్టేట్ పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్ గుర్నాథ్రెడ్డి, ఆర్యవైశ్య కార్పొరేషన్‌చైర్మన్ కాల్వ సుజాత, టూరిజం కార్పొరేషన్చైర్మన్పటేల్రమేశ్రెడ్డి, ఫుడ్కార్పొరేషన్చైర్మన్ఫయీమ్, ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి, వీర్లపల్లి శంకర్, కలెక్టర్ ప్రతీక్‌జైన్, డీఎస్పీ నారాయణరెడ్డి, కొడంగల్ ఇన్చార్జి తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.