స్టేట్​ లెవెల్​ రోలర్ స్కేటింగ్ లో గోల్డ్​ మెడల్ .. సాధించిన గుమ్మడం గ్రామాం విద్యార్థి

పెబ్బేరు, వెలుగు: స్టేట్​ లెవెల్​ రోలర్​ స్కేటింగ్​ పోటీల్లో మండలానికి చెందిన స్టూడెంట్​ గోల్డ్​ మెడల్​ సాధించాడు. ఆదివారం హైదరాబాద్​లోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్  స్టేడియంలో యూత్  రోలర్​ స్కేటింగ్​​ ఫౌండేషన్​ ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో మండలంలోని గుమ్మడం గ్రామానికి చెందిన గడ్డం సుశాంత్  జై ప్రతిభ చూపి గోల్డ్​ మెడల్​ సాధించాడు. 

అతడిని గ్రామస్తులు, తోటి విద్యార్థులు అభినందించారు.