సాంఘిక సంక్షేమ హాస్టల్లో విరేచనాలతో విద్యార్థి మృతి

సాంఘిక సంక్షేమ హాస్టల్ లో విరేచనాలతో విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళితే..

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ సాంఘిక సంక్షేమ హాస్టల్ లో 5 వ తరగతి చదువుతున్న దివ్యకాంత్ అనే విద్యార్థి నిన్న(ఫిబ్రవరి 13) రాత్రి నుంచి తీవ్ర విరేచనాలతో  బాధపడుతున్నాడని హాస్టల్ సిబ్బంది తెలిపారు. దీంతో ఈ రోజు(ఫిబ్రవరి 14)  దివ్యకాంత్ ని ప్రభుత్వ హాస్పిటల్ తరలించారు హాస్టల్ సిబ్బంది.. అయితే ఆసుపత్రికి వచ్చేలోపే విద్యార్థి  మృతి చెందినట్లు డాక్టర్లు నిర్థారించారు.

విద్యార్థి స్వగ్రామం పరిగి నియోజకవర్గం పూడూరు మండలం కల్లెపల్లి గ్రామం కాగా.. సాంఘిక సంక్షేమ హాస్టల్ ఉండి MJPTBCWR బాయ్స్ స్కూల్ లో చదువుతున్నాడని హాస్టల్ సిబ్బంది తెలిపారు. ఈ సమాచారాన్ని దివ్యకాంత్ కుటుంబ సభ్యులకు తెలిపామని సిబ్బంది పేర్కొన్నారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు హాస్టల్ కు చేరుకొని దర్యాప్తు చేపట్టారు.