APPSC GROUP 1: ప్రిలిమ్స్ పరీక్షలో కాపీ కొడుతూ పట్టుబడ్డ యువకుడు

రాష్ట్రంలో గ్రూప్ 1 కి సంబంధించి ప్రిలిమ్స్ పరీక్ష జరుగుతోంది. ప్రశాంతంగా ప్రారంభమైన ఈ పరీక్షలో ఓ యువకుడు కాపీ కొడుతూ పట్టుబడ్డ ఘటన ఒంగోలులో చోటు చేసుకుంది. పరీక్షా కేంద్రంలోకి సెల్ ఫోన్ తో ప్రవేశించిన ఆ యువకుడు కాపీకి పాల్పడుతుండగా ఇన్విజిలేటర్ పట్టుకున్నాడు. ఆ తర్వాత యువకుడిని పోలీసులకు అప్పగించారు. ఒంగోలులోని క్విస్ ఇంజినీరింగ్ కళాశాలో ఈ ఘటన చోటు చేసుకుంది.

రాష్ట్ర వ్యాప్తంగా 18జిల్లాల్లో 301 పరీక్షా కేంద్రాల్లో ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహిస్తోంది ప్రభుత్వం. ఉదయం 10గంటలకు ప్రారంభమైన ఈ పరీక్ష రెండు పేపర్లుగా జరుగుతుంది. 10గంటల నుండి 12గంటల వరకు పేపర్ 1, మధ్యాహ్నం 2గంటల నుండి 4గంటల వరకు పేపర్ 2 జరగనుంది. ఈ క్రమంలో ఎంతో సమయం వెచ్చించి పరీక్షలకు ప్రిపేర్ అయిన అభ్యర్థులు పరీక్షల్లో కాపీయింగ్ కి పాల్పడి భవిష్యత్తును అంధకారం చేసుకోవద్దని అధికారులు అన్నారు.