వెయిట్ లిఫ్టింగ్ పోటీలో విద్యార్థికి రజతం

మక్తల్, వెలుగు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పాటియాలాలో జరిగిన వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో మక్తల్ కు చెందిన విద్యార్థినికి రజత పతకం సాధించింది. 71 కేజీల విభాగంలో పట్టణానికి చెందిన వడ్ల గోవింద్ కుమార్తె వడ్ల జాహ్నవి సత్తా చాటినట్లు కోచ్ సంపత్ కుమార్ తెలిపారు. హైదరాబాద్ లోని హకీంపేట స్పోర్ట్స్ స్కూల్లో చదువుతున్న వడ్ల జాహ్నవి వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో శిక్షణ తీసుకుంటుందని తెలిపారు. 

తాజాగా జాతీయ స్థాయిలో జరిగిన వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో ఏకంగా రజత పతకం సాధించి సత్తా చాటిందని తెలిపారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు, టీచర్లు అభినందనలు తెలిపారు. వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటి మక్తల్ పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని పలువురు ఆకాంక్షించారు.