మెదక్టౌన్, వెలుగు: నలభై శాతం ఫిట్మెంట్తో కొత్త పీఆర్సీ వేయాలని ఎస్టీయూ జిల్లా ప్రెసిడెంట్రాజగోపాల్ డిమాండ్చేశారు. ఆదివారం ఎస్టీయూ 77వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని పతాకావిష్కరణ చేసి మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా స్కూళ్లలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవడంతో పాటు టీచర్ల పదోన్నతులు, బదిలీల షెడ్యూల్ పారదర్శకంగా నిర్వహించాలన్నారు.
పెండింగ్ లో ఉన్న నాలుగు డీఏలు, పీఆర్సీ ఎరియర్స్, మెడికల్ బిల్లులు, సరెండర్ బిల్లులు, జీపీఎఫ్పార్ట్ ఫైనల్ బిల్లులు తక్షణమే విడుదల చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా జనరల్ సెక్రెటరీ పోచయ్య, కార్యదర్శి కిష్టయ్య, జిల్లా నాయకులు భూపతిగౌడ్, శ్రీనివాస్, మధుసూదన్ రావు, సత్యనారాయణ, దిలీప్ కుమార్, నరేశ్, ఎల్లం, మల్లేశ్, కిరణ్, సతీశ్, వెంకట కృష్ణ పాల్గొన్నారు.