ఇండియా టాపార్డర్ బ్యాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షెఫాలీపై వేటు

న్యూఢిల్లీ : ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోల్పోయి ఇబ్బంది పడుతున్న ఇండియా విమెన్స్ క్రికెట్ టీమ్ టాపార్డర్ బ్యాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షెఫాలీ వర్మపై సెలెక్టర్లు వేటు వేశారు. వచ్చే నెలలో ఆస్ట్రేలియాలో ఆడే మూడు వన్డేల సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పాల్గొనే టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి ఆమెను తప్పించారు. ఈ సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం 16 మందితో కూడిన జట్టును మంగళవారం ప్రకటించారు. 20 ఏండ్ల షెఫాలీ ఈ ఏడాది ఆడిన ఆరు వన్డేల్లో 108 రన్స్ మాత్రమే చేసింది.   యంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉమా ఛెత్రి, దయలన్ హేమలత, శ్రేయాంక పాటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సయాలి సత్ఘారెను సెలెక్టర్లు పక్కనబెట్టారు.

కివీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆడని హర్లీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డియోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రిచా ఘోష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మిన్ను మణి, టిటాస్ సాధు, ప్రియా పునియాను ఆసీస్ టూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఎంపిక చేశారు. ఈ సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తొలి రెండు వన్డేలు డిసెంబర్ 5, 8వ తేదీల్లో బ్రిస్బేన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని అలన్ బోర్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫీల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జరుగుతాయి. మూడో వన్డేను డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 11న పెర్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని వాకా గ్రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో షెడ్యూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు.

ఇండియా టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ : హర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రీత్ కౌర్ (కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌), ప్రియా పునియా, జెమిమా రోడ్రిగ్స్, హర్లీన్ డియోల్, యాస్తిక భాటియా (కీపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌), రిచా ఘోష్ (కీపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌), తేజల్ హసబ్నిస్, దీప్తి శర్మ, మిన్ను మణి, ప్రియా మిశ్రా, రాధా యాదవ్, టిటాస్ సాధు , అరుంధతి రెడ్డి, రేణుకా  ఠాకూర్, సైమా ఠాకూర్.