మత మార్పిడికి పాల్పడే వారిపై కఠిన చర్యలు

మత మార్పిడికి పాల్పడే వారిపై కఠిన చర్యలు
బలవంతపు మతమార్పిడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది మధ్యప్రదేశ్ ప్రభుత్వం. మతమార్పిడులను నివారించేందుకు తీసుకొచ్చిన బిల్లును ఇవాళ(శనివారం) ఆ రాష్ట్ర కేబినెట్ ఆమోదించింది. ఈ బిల్లు అసెంబ్లీ ఆమోదం పొందితే… మత మర్పిడులకు పాల్పడే వారికి 10 ఏళ్ల జైలు శిక్ష తో పాటు.. రూ.లక్ష వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. ఈ శిక్ష కేవలం ఆవ్యక్తికి మాత్రమే పరిమితం కాదు. మత సంబంధమైన సంస్థలు కూడా ఈ చట్టం కింద శిక్షను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ బిల్లును ‘ధర్మ స్వతంత్ర్య బిల్లు 2020’గా కేబినెట్ మీటింగ్ టేబుల్ పై పెట్టారు. అమాయకమైన బాలికలను మోసం చేసే ప్రయత్నాలను తమ ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచి వేస్తుందని  చెప్పారు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్. పంచాయతి ఎన్నికలలో పోటీ చేసేందుకు మన బిడ్డలను పెళ్లి చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వాటిని ఏమాత్రం ఉపేక్షించబోమని హెచ్చరించారు. మతమార్పిడులకు పాల్పడేవారు కఠిన శిక్షలను ఎదుర్కోక తప్పదని చెప్పారు హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా.