ఐదేండ్ల చిన్నారిపై వీధికుక్కల దాడి

కొల్లాపూర్, వెలుగు : ఐదేళ్ల చిన్నారిపై వీధికుక్కలు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన నాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కర్నూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లా కొల్లాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని జయశంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాలనీలో శుక్రవారం జరిగింది. కాలనీకి చెందిన ధనుశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శుక్రవార ఉదయం ఆరుబయట ఆడుకుంటున్నాడు. ఈ సమయంలో వీధికుక్కలు దాడి చేయడంతో తీవ్ర గాయాలు అయ్యాయి.

గమనించిన స్థానికులు, కుటుంబ సభ్యులు ధనుశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కొల్లాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ప్రభుత్వ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తరలించారు. కాగా మున్సిపాలిటీలో కుక్కల బెడద ఎక్కువగా ఉందని, మున్సిపల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లు స్పందించి సమస్యను పరిష్కరించాలని కాలనీవాసులు కోరుతున్నారు.