కోడి పుంజు బొమ్మ కోసం...
టైటిల్ : భామా కలాపం - 2
డైరెక్షన్ : అభిమన్యు తాడిమేటి
కాస్ట్ : ప్రియమణి, సీరత్ కపూర్, రఘు ముఖర్జీ, బ్రహ్మాజి, శరణ్య ప్రదీప్
లాంగ్వేజ్ : తెలుగు
ప్లాట్ ఫాం : ఆహా
ఈ సిరీస్ పార్ట్ –1లో అనుపమ (ప్రియమణి) కుటుంబం ఆపద నుంచి తప్పించుకుంటుంది. ఆ తర్వాత వేరే ఇంటికి షిఫ్ట్ అవ్వడంతో రెండో భాగం మొదలవుతుంది. ‘‘ఇతరుల విషయాలను పట్టించుకోను’’ అని భర్తకు మాట ఇచ్చిన అనుపమ యూట్యూబ్ ద్వారా వచ్చిన డబ్బుతో ఒక హోటల్ పెడుతుంది. పనిమనిషి శిల్ప (శరణ్య)ను హోటల్ బిజినెస్‌లో పార్ట్నర్గా చేసుకుంటుంది. ‘హమ్మయ్య అంతా సజావుగా సాగిపోతుంది’ అనుకునేలోపు మరో సమస్యలో చిక్కుకుంటుంది అనుపమ. దాన్ని సాల్వ్ చేసే పనిలో భాగంగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో మాజీ ఆఫీసర్ని కలుస్తుంది. ఆ తర్వాత ఏమైంది? అనుపమకు వెయ్యి కోట్ల విలువైన కోడి పుంజు బొమ్మను దొంగతనం చేయాల్సిన అవసరం ఎందుకొచ్చింది? వంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే.
ఏసీపీ కేస్ సాల్వ్ చేశాడా?
టైటిల్ : అబ్రహాం ఓజ్లర్
డైరెక్షన్ : మిథున్ మాన్యుల్ థామస్
కాస్ట్ : జయరాం, మమ్ముట్టి, జగదీశ్, సెంథిల్ క్రిష్ణ, అనస్వర రాజన్, అర్జున్ అశోకన్, సైజూ కురుప్
లాంగ్వేజ్ : తమిళం
ప్లాట్ ఫాం : డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
ఏసీపీ అబ్రహాం ఓజ్లర్ (జయరాం) తన భార్య బిడ్డలకు దూరమై బాధలో ఉంటాడు. ఆ బాధలో ఉన్న అతనికి మిస్టరీ మర్డర్ల కేస్ ఒకటి సాల్వ్ చేసే పని అప్పజెప్తారు. ఆ కేస్‌ని ఎలాగైనా సాల్వ్ చేయాలనుకుంటాడు ఓజ్లర్. సరిగ్గా అదే టైంలో ఒకచోట క్రైమ్ జరిగిందని ఒక ఫోన్ కాల్ వస్తుంది. అక్కడికి వెళ్లి చూస్తే అక్కడ ఏం ఉండదు. తర్వాత ఇంటికొచ్చి చూస్తే తన భార్య, కూతురు కిడ్నాప్ అవుతారు. కొన్ని రోజుల తర్వాత ఒక బర్త్ డే సెలబ్రేషన్‌కి వచ్చిన కొంతమంది మిస్ అవుతుంటారు. వాళ్లెందుకు మిస్ అవుతున్నారు? ఆ కేస్‌ని ఏసీపీ ఎలా సాల్వ్ చేశాడు? అనేది మిగతా కథ. ఇది ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. స్క్రీన్ ప్లే, సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నాయి. ఫ్లాష్‌బ్యాక్‌లో మమ్ముట్టి సర్ప్రైజ్ చేస్తాడు.
గెలుపు ఎవరిది?
టైటిల్ : రాయ్ సింఘానీ వర్సెస్ రాయ్ సింఘానీ
డైరెక్షన్ : అనిరుద్ధ రాజ్దేకర్, భావ్నా శ్రేస్త్
కాస్ట్ : జెన్నిఫర్ వింజెట్, కరణ్ వాహి, రీమ్ షేక్, సంజయ్ నాథ్, కియారా సాధ్
లాంగ్వేజ్ : హిందీ
ప్లాట్ ఫాం : సోనీ లివ్
లాయర్ల చుట్టూ తిరిగే కోర్టు రూమ్ డ్రామా. తండ్రి నడిపించే లా ఫర్మ్‌లో కూతురు అనుష్క (జెన్నిఫర్) లాయర్‌గా పనిచేస్తుంటుంది. చాలా చురుగ్గా ఉండే ఆమె నైతిక విలువలు పాటిస్తూ కమిట్మెంట్తో పనిచేస్తుంది. తన తండ్రి పేరు ప్రతిష్టలను కాపాడుతూ వస్తుంది. అయితే ఆమెకు నెపో కిడ్ అనిపించుకోవడం ఇష్టం ఉండదు. అందుకని సొంతంగా గుర్తింపు తెచ్చుకోవాలనే లక్ష్యంతో ఉంటుంది. ఆ జర్నీలో వ్యక్తిగతంగా, వృత్తిగతంగా వచ్చే ఇబ్బందుల్ని ఎదుర్కొనే తీరు ప్రేక్షకుల్ని ఇంప్రెస్ చేస్తుంది. అదే లా ఫర్మ్‌లో పనిచేసే లాయర్ విరాట్ (కరణ్ వాహి) కూడా ఆమెలాగే ఇంటెలిజెంట్. వీళ్లిద్దరి మధ్య సంభాషణలు ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. వీళ్లిద్దరితో పాటు అంకిత (రీమ్) అనే ఒక యువ లాయర్ ఆ సంస్థలో ఇంటర్న్‌గా చేరుతుంది. ఆమె వచ్చాక కథలో ఇంట్రెస్ట్ మొదలవుతుంది. పైగా వీళ్ల ముగ్గురి ఆలోచనలు వేరు వేరుగా ఉంటాయి. ఈ వెబ్‌సిరీస్‌లో లీగల్ డ్రామా బాగా వర్కవుట్ అయింది. ప్రతి ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. జెన్నిఫర్, కరణ్ వాహిల నటన బాగుంది.