- ఆ శవం ఎవరిది?
- టైటిల్ : పురుష ప్రేతమ్
- (ది మేల్ ఘోస్ట్)
- కాస్ట్ : దర్శనా రాజేంద్రన్
- లాంగ్వేజ్ : మలయాళం
- డైరెక్షన్ : క్రిషంద్
- రన్ టైం : రెండున్నర గంటలు
- ప్లాట్ ఫాం : సోనీ లివ్
నదిలో ఒక గుర్తు తెలియని శవం కనిపిస్తుంది. బాగా దుర్వాసన వస్తుండడంతో అది చూసిన స్థానికులు నదికి అవతల వైపున ఉన్న పోలీస్ స్టేషన్లో ఎస్సై సెబాస్టియన్‌కి ఆ విషయాన్ని చెప్తారు. అక్కడికి వచ్చిన ఎస్సై నది మధ్యలో ఉన్న రాయికి వేలాడుతున్న ఆ శవం తన పరిధిలోకి రాదని అది ఎటు వెళుతుందో చూస్తుంటాడు. అంతలో ఒక ఈతగాడు నదిలోకి వెళ్లి శవాన్ని సెబాస్టియన్ ఉన్న వైపు తీసుకొస్తాడు. తర్వాత దాన్ని మార్చురీకి తీసుకెళ్తారు. మూడు రోజులైనా ఆ శవానికి సంబంధించిన వాళ్లు ఎవరూ రాకపోవడంతో డాక్టర్ తీసుకెళ్లమంటాడు. చేసేదేం లేక పోలీసులే పూడ్చి పెట్టేస్తారు. పేపర్లో వచ్చిన వార్తను మూడు రోజుల తర్వాత చూసిన సుసన్నా (దర్శనా రాజేంద్రన్) తన తమ్ముడితో కలిసి పోలీస్ స్టేషన్‌కి వెళ్తుంది. తన భర్త కొన్నిరోజుల నుంచి కనిపించడం లేదని చెప్తుంది. శవం చూపిస్తే గుర్తు పడతానంటుంది. కానీ, అక్కడకి వెళ్లి చూస్తే శవం కనిపించదు. ఇంతకీ శవం ఏమైనట్టు? దొరికిందా లేదా? అసలు ఆ శవం సుసన్నా భర్తదేనా? కాదా? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. ఇది డార్క్ కామెడీ మూవీ. ప్రతి సీన్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. రెగ్యులర్ ఇన్వెస్టిగేషన్ స్టోరీలా కాకుండా ఇందులో కొన్ని కొత్త పాయింట్స్ టచ్ చేశారు. దర్శనా రాజేంద్రన్ నటన బాగుంది.
- కూతురి వెతుకులాట
- టైటిల్ : గ్యాస్ లైట్, కాస్ట్ : సారా అలీఖాన్, విక్రాంత్ మెస్సే, చిత్రాంగద, లాంగ్వేజ్ : హిందీ
- డైరెక్షన్ : పవన్ క్రిపలాని
- రన్ టైం : ఒక గంట 50 నిమిషాలు
ప్లాట్ ఫాం : డిస్నీ ప్లస్ హాట్ స్టార్మీషా (సారా అలీఖాన్) పక్షవాతం వల్ల చక్రాల కుర్చీ సాయంతో జీవితాన్ని గడుపుతుంటుంది. మూడేండ్ల తర్వాత వాళ్ల నాన్నని చూడటానికి ఇంటికొస్తుంది. అయితే, అక్కడ ఆయన కనిపించరు. దాంతో తండ్రి ఎక్కడికి వెళ్లాడో తెలుసుకోవాలి అనుకుంటుంది. ఇంతకీ ఆయన ఎక్కడున్నాడు? సేఫ్‌గా ఉన్నాడా? లేదా? మీషా ఆయన్ని కనుక్కోగలిగిందా? అనేది సినిమాలో చూడాలి. ఈ సినిమా రన్ టైం రెగ్యులర్ సినిమాల కంటే తక్కువే. కానీ, గ్యాస్ లైట్ చూడాలంటే ఇంట్లో ఉన్న లైట్లన్నీ వేసుకోవాల్సిందే. లేకపోతే ఏం కనిపించదు. ప్రతి షాట్ చీకట్లోనే ఉంటుంది. సినిమా మొత్తం నైట్ ఎఫెక్ట్‌లో ఉండాలని కాబోలు డార్క్మోడ్లోనే తీశారు. అందువల్ల యాక్టర్స్ ఎక్స్ప్రెషన్స్, యాక్షన్ చూడాలనుకుంటే కష్టమే. ఓన్లీ, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, డైలాగ్స్‌తో నడుస్తుంటుంది. అదంతా ఒక ఎత్తయితే, ఇది హారర్ జానర్ కాదు.. అలాగని థ్రిల్లర్ కాదు. రెండింటికీ మధ్యలో ఉన్నట్టు అనిపిస్తుంది. ఫస్టాఫ్‌లో దెయ్యం ఉందేమో అనిపిస్తుంది. తర్వాత సారా మానసికారోగ్యం బాగోలేదని ప్రూవ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. ఆ తర్వాత మీషా వాళ్ల నాన్న గురించి ఇన్వెస్టిగేషన్ మొదలు పెడుతుంది.
- క్యూట్ లవ్
- టైటిల్ : టు సీజన్స్
- పార్ట్ –1
- కాస్ట్ : జీవన్ ప్రియ, పవన్ సింగులూరి
- లాంగ్వేజ్ : తెలుగు
- డైరెక్షన్ : ఆకాశ్ సూరతు
- రన్ టైం : 16 నిమిషాలు యూట్యూబ్ ఛానెల్ :
- సౌత్ ఇండియన్ లాజిక్
చైత్ర, హేమంత్ ఎనిమిదేండ్లుగా ప్రేమించుకుంటుంటారు. కానీ, ఇన్నేండ్లలో ఇద్దరూ కలిసి ట్రిప్, టూర్లకు వెళ్లింది లేదు. అందుకని చైత్ర ఒకరోజు హేమంత్‌తో ‘ఏదైనా ట్రిప్‌కి వెళ్దాం’ అంటుంది. అందుకు హేమంత్, ‘సరే ఎక్కడికి వెళ్దాం’ అని అడుగుతాడు. దానికి చైత్ర రాజస్తాన్, జైపూర్ అంటుంది. ఆ పేర్లు వినగానే హేమంత్ షాకై ‘ఎండాకాలంలో ఎడారి ప్లేస్‌లకు వెళ్లమని సలహా ఇచ్చింది ఎవరు?’ అంటాడు. ‘మా నాన్న’ అంటుంది చైత్ర. దాంతో చేసేదేం లేక హేమంత్ ‘సరే’నంటాడు. తర్వాతి రోజు హేమంత్, ‘ఆఫీస్‌లో లీవ్ అడిగా.. మనతోపాటు వివేక్, వర్ష కూడా వస్తా అన్నారు’ అని చైత్రకు చెప్తాడు. అది విన్న చైత్ర ‘వాళ్లెందుకు?’ అని చిరాగ్గా అడుగుతుంది. దాంతో... ఐదు రోజులు వాళ్లిద్దరి మధ్య మౌనపోరాటం జరుగుతుంది. ఆ తర్వాత ఎలాగో చైత్రను కన్విన్స్ చేస్తాడు హేమంత్. చివరకు వాళ్లు ట్రిప్‌కి వెళ్లారా? లేదా? అనేది చూడాలంటే పార్ట్–2 వచ్చే వరకు ఎదురు చూడాల్సిందే.
