బొమ్మరాశిపేటలో ఒకేరోజు ఏడుగురిపై వీధి కుక్క దాడి

శామీర్ పేట, వెలుగు: మేడ్చల్ జిల్లా బొమ్మరాశిపేటలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. శుక్రవారం సాయంత్రం ఒకేరోజు ఏడుగురిపై ఓ కుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. ఇంటి ముందు ఆడుకుంటున్న రెండేళ్ల చిన్నారి అక్షితకు తీవ్ర గాయాలయ్యాయి. నరసింహ అనే వ్యక్తి ఇంటి ముందు నిల్చొని ఉండగా కుక్క దాడికి పాల్పడింది. జగన్ కూడ గ్రామానికి చెందిన రోజువారి కూలీ సెంట్రింగ్​పని నిమిత్తం శుక్రవారం బొమ్మరాసిపేటకు వచ్చాడు. 

మధ్యాహ్న సమయంలో అన్నం తింటుండగా కుక్క ఒక్కసారిగా దాడి చేసింది. వీరితోపాటు మరో ముగ్గురు కుక్క దాడిలో స్వల్పంగా గాయపడ్డారు. అయితే రేబిస్​ఇంజక్షన్లు అందుబాటులో లేకపోవడంతో శామీర్​పేటలోని సామాజిక ఆరోగ్య కేంద్రం డాక్టర్లు బాధితులను నల్లకుంట ఫీవర్ ఆసుపత్రికి రిఫర్ చేశారు. గత మూడు రోజుల్లో 20 మందికి పైగా వీధి కుక్కల దాడిలో గాయపడ్డారని చెప్పారు.