బజ్జీలు ఉద్దెర ఇవ్వలేదని వేడి నూనె పోసిండు

కేటిదొడ్డి, వెలుగు: హోటల్‌‌‌‌‌‌‌‌లో బజ్జీలు ఉద్దెర ఇవ్వలేదన్న కోపంతో ఓ వ్యక్తి వేడి నూనె పోయడంతో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఎస్సై శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌ తెలిపిన వివరాల ప్రకారం... గద్వాల జిల్లా కేటీదొడ్డి మండలం గువ్వలదిన్నె గ్రామానికి చెందిన బుజ్జన్న గౌడ్‌‌‌‌‌‌‌‌ స్థానికంగా హోటల్‌‌‌‌‌‌‌‌ నడుపుతున్నాడు. శనివారం రాత్రి అదే గ్రామానికి చెందిన వినోద్‌‌‌‌‌‌‌‌ అనే వ్యక్తి హోటల్‌‌‌‌‌‌‌‌ వద్దకు వచ్చి బజ్జీలు ఉద్దెర ఇవ్వాలని అడిగాడు.

ఇందుకు బుజ్జన్నగౌడ్‌‌‌‌‌‌‌‌ నిరాకరించడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన వినోద్‌‌‌‌‌‌‌‌ వేడి నూనెను బుజ్జన్నగౌడ్‌‌‌‌‌‌‌‌పై పోశాడు. ఈ క్రమంలో పక్కనే ఉన్న వీరేశ్‌‌‌‌‌‌‌‌ అనే వ్యక్తి ముఖంపై కూడా నూనె పడింది. దీంతో ఇద్దరికి గాయాలు అయ్యాయి. వీరేశ్‌‌‌‌‌‌‌‌ భార్య శంకరమ్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌ తెలిపారు.