హైదరాబాద్, వెలుగు: తమ రీస్ట్రక్చరింగ్ ప్రపోజల్‌కు స్టాక్ఎక్స్చేంజ్ల అనుమతి వచ్చినట్లు జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తెలిపింది. నాన్-ఎయిర్పోర్ట్ బిజినెస్‌ను డీమెర్జర్ చేయాలని కూడా కంపెనీ ప్రతిపాదించింది. ప్రపోజల్‌పై ఎలాంటి అభ్యంతరాలనూ ఎక్స్చేంజ్లు చెప్పలేదని కంపెనీ వెల్లడించింది. దీంతో రాబోయే ఆరు నెలల్లో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) వద్ద ఈ స్కీమును దాఖలు చేయనున్నట్లు జీఎంఆర్ ఇన్ఫ్రా తెలిపింది. జీఎంఆర్ పవర్ ఇన్ఫ్రా (జీపీఐఎల్), జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, జీఎంఆర్ పవర్ అండ్ అర్బన్ ఇన్ఫ్రాల అమాల్గమేషన్, అరేంజ్‌మెంట్‌ను ఎక్స్చేంజ్ల అనుమతి కోసం జీఎంఆర్ ఫైల్ చేసింది.
గ్రూప్ కంపెనీల రీస్ట్రక్చరింగ్‌కు స్ట్రాటజిక్ ప్లాన్‌ను ఈ ఏడాది ఆగస్టులో కంపెనీ తీసుకొచ్చింది. నాన్ ఎయిర్పోర్ట్ బిజినెస్‌ల డీమెర్జర్తోపాటు, కార్పొరేట్ హోల్డింగ్ స్ట్రక్చర్‌ను సింప్లిఫై చేసేందుకు ఈ ప్లాన్ రూపొందించారు. తామున్న వివిధ వ్యాపారాలలో ఫోకస్ పెరిగేందుకు ప్లాన్ సాయపడుతుందని జీఎంఆర్ చెబుతోంది. ఫలితంగా గ్లోబల్ ఇన్వెస్టర్లను తెచ్చుకోవడం ఈజీ కావడమే కాకుండా, ప్రస్తుత జీఎంఆర్ ఇన్ఫ్రా షేర్ హోల్డర్లకూ ప్రయోజనం కలుగుతుందని పేర్కొంటోంది. ఎయిర్‌పోర్టు, నాన్ ఎయిర్‌పోర్టు బిజినెస్‌లను వేరువేరుగా లిస్ట్ చేయడం వల్ల కార్పొరేట్ హోల్డింగ్ స్ట్రక్చర్ కూడా సింప్లిఫై అవుతుందని వివరించింది. దేశంలోనే బిజీ ఎయిర్పోర్ట్ అయిన ఇందిరా గాంధి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (న్యూఢిల్లీ), హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులను జీఎంఆర్ గ్రూప్ నిర్వహిస్తోంది.
