బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆతిధ్య ఆస్ట్రేలియాకు ఏదీ కలిసి రావడం లేదు. తొలి టెస్టులో ఊహించని పరాజయం ఎదుర్కొన్న ఆ జట్టు.. అడిలైడ్ టెస్టుకు ముందు గాయాలతో సతమతమవుతుంది. ఇప్పటికే గాయం కారణంగా ఫాస్ట్ బౌలర్ జోష్ హేజల్ వుడ్ దూరం కాగా.. తాజాగా ఈ లిస్టులో స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ చేరనున్నట్టు తెలుస్తుంది. మంగళవారం(డిసెంబర్ 3) అడిలైడ్‌లో నెట్స్‌లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు స్టీవ్ స్మిత్ చేతి వేళ్ళకు గాయమైంది.
సహచరుడు మార్నస్ లాబుస్‌చాగ్నే వేసే త్రోడౌన్‌లు ప్రాక్టీస్ చేసే క్రమంలో స్మిత్ కు ఈ గాయమైంది. ఇంతలో ఫిజియో రాగా.. స్మిత్ నెట్స్ నుండి నిష్క్రమించాడు. అతని గాయంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరో మూడు రోజుల్లో అడిలైడ్ టెస్టు ప్రారంభం కానుంది. ఈ లోపు స్మిత్ కోలుకోవడం అనుమానంగా మారింది. ఒకవేళ స్మిత్ దూరమైతే అతని స్థానంలో వికెట్ కీపర్ జోష్ ఇంగ్లిష్ ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ALSO READ : బుమ్రాను ఎదుర్కొన్నానని నా మనవళ్లకు చెబుతా: హెడ్
పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టు ఓటమి తర్వాత ఆస్ట్రేలియా ఒత్తిడిలో కనిపిస్తుంది. సిరీస్ చేజారకుండా ఉండాలంటే రెండో టెస్టులో ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు వెళ్లాలంటే ఈ మ్యాచ్ గెలుపు అత్యంత కీలకం. ఈ నేపథ్యంలో స్టార్ ప్లేయర్ల గాయాలు ఆసీస్ జట్టును ఆందోళనకు గురి చేస్తున్నాయి. అడిలైడ్ వేదికగా డిసెంబర్ 6 నుంచి రెండో టెస్ట్ జరగనుంది. 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో భారత్ ఇప్పటికే 1-0 ఆధిక్యంలో నిలిచింది.
? Another injury scare for Australia!
— RevSportz Global (@RevSportzGlobal) December 3, 2024
Steve Smith in pain after being hit on his fingers by a throwdown from Marnus Labuschagne. After being attended by a physio, Smith left the nets. @debasissen reporting from Adelaide #INDvsAUS #BGT2024 pic.twitter.com/jgEQO0BTuz