ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ టెస్ట్ కెరీర్ లో బ్యాడ్ టైమ్‌ను ఎదుర్కొంటున్నాడు. అతను 2015 తర్వాత తొలిసారి ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో టాప్ 10 లో చోటు కోల్పోయాడు. తాజాగా ప్రకటించిన ఐసీసీ ర్యాంకింగ్స్ లో మూడు స్థానాలు దిగజారి 11 స్థానానికి పడిపోయాడు. రెండేళ్ల నుంచి స్మిత్ ఫామ్ అంతంత మాత్రంగానే ఉంది. ఏడాది కాలంగా అత్యంత దారుణంగా ఉంది. ఒకరకంగా చెప్పాలంటే అతను ఆస్ట్రేలియా జట్టులో స్థానం కోల్పోయినా ఆశ్చర్యం లేదనే వార్తలు వస్తున్నాయి.
స్మిత్ తన చివరి తొమ్మిది ఇన్నింగ్స్‌లలో యావరేజ్ 17.4 మాత్రమే ఉంది. ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ తీవ్రంగా నిరాశపరిచాడు. నాలుగు ఇన్నింగ్స్ ల్లో ఒక్కసారి కూడా 30 పరుగుల మార్క్ టచ్ చేయలేకపోయాడు. ప్రస్తుత స్మిత్ యావరేజ్ (56.09) ఉనప్పటికీ అతని ఫామ్ ఆస్ట్రేలియాను ఆందోళనకు గురి చేస్తుంది. 2024లో మొత్తం 13 ఇన్నింగ్స్‌ల్లో 23.20 యావరేజ్ తో 232 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఒక్క సెంచరీ లేకపోగా.. ఒక్క అర్ధ సెంచరీ మాత్రమే ఉంది.
ALSO READ | SMAT 2024: అంపైర్‌ను కూడా లెక్క చేయలేదు: గ్రౌండ్‌లో గొడవకు దిగిన భారత క్రికెటర్లు
ప్రస్తుతం ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ విషయానికి వస్తే.. ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ ఐసీసీ టెస్టు బ్యాటర్లలో నంబర్ వన్ ర్యాంక్ కోల్పోయాడు. సూపర్ ఫామ్‌లో దూసుకెళ్తున్న అతని తోటి ఆటగాడు హ్యారీ బ్రూక్ నయా నంబర్ వన్‌గా నిలిచాడు. మరోవైపు ఇండియా స్పీడ్‌స్టర్ జస్‌ప్రీత్ బుమ్రా, స్పిన్నర్ రవీంద్ర జడేజా బుధవారం తాజా జాబితాలో బౌలింగ్, ఆల్‌రౌండర్లలో తమ అగ్రస్థానాలను నిలబెట్టుకున్నారు.
గత వారం న్యూజిలాండ్‌పై దంచికొట్టి తన కెరీర్‌లో ఎనిమిదో సెంచరీ సాధించిన 25 ఏండ్ల బ్రూక్ 898 రేటింగ్ పాయింట్లతో ఈఏడాది జులై నుంచి అగ్రస్థానంలో ఉన్న జో రూట్‌ను (897) రెండో స్థానానికి నెట్టి టాప్ ర్యాంక్‌లోకి వచ్చాడు. బౌలర్ల జాబితాలో బుమ్రా (890) టాప్ ప్లేస్‌లోనే ఉండగా.. జడేజా (415) ఆల్‌రౌండర్లలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
After 3,700 days, Steve Smith has dropped out of the top 10 Test batting rankings for the first time in nearly 10 years ?
— CricTracker (@Cricketracker) December 12, 2024
What's going wrong for Steve Smith with the bat in Test cricket recently? pic.twitter.com/iJTQcHmJ8M