రాష్ట్రవ్యాప్తంగా సెట్విన్  సెంటర్లు ఏర్పాటు చేస్తాం. .

  • చైర్మన్ గిరిధర్ రెడ్డి, ఎండీ వేణుగోపాల్ రావు

జహీరాబాద్, వెలుగు: సెట్విన్  సేవలను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు ప్రణాళిక రూపొందించినట్లు సెట్విన్  సంస్థ చైర్మన్  గిరిధర్ రెడ్డి, ఎండీ వేణుగోపాల్ రావు తెలిపారు. గురువారం జహీరాబాద్  ఎంపీడీవో సమావేశ మందిరంలో ఏర్పాటు చేయనున్న ట్రైనింగ్  సెంటర్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ జహీరాబాద్, హుస్నాబాద్, నల్గొండ, జడ్చర్ల, మహబూబ్ గర్ లో కొత్తగా ట్రైనింగ్  సెంటర్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు.

ఇప్పటికే రాష్ట్రంలో 23 సెంటర్లు ఉన్నాయని, అదనంగా 5 సెంటర్లను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. ఈ నెల 17న హుస్నాబాద్ లో మొదటి సెంటర్ ను ప్రారంభించి, రెండవ సెంటర్ ను జహీరాబాద్ లో ప్రారంభిస్తామని తెలిపారు. జహీరాబాద్ లో ఏసీ, మొబైల్, సీసీ కెమెరా రిపేరింగ్, ప్రీ ప్రైమరీ టీచర్స్, టైలరింగ్ తో పాటు ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటీషియన్  కోర్సులను  ప్రారంభిస్తున్నట్లు చెప్పారు.