సమగ్ర కుటుంబ సర్వే పకడ్బందీగా ఉండాలి : రవిచంద్ర

దేవరకొండ, వెలుగు : సమగ్ర కుటుంబ సర్వే పకడ్బందీగా ఉండాలని రాష్ట్రస్థాయి బృందం అధ్యక్షుడు రవిచంద్ర సూచించారు. సర్వే రాష్ట్రస్థాయి బృందం శుక్రవారం నల్గొండ జిల్లా దేవరకొండ మున్సిపాలిటీలోని రెండో వార్డు, కట్టకొమ్ము తండాలో సర్వే తీరును పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేను సక్రమంగా నిర్వహించాలని ఎన్యుమరేటర్లకు సూచించారు.

 సర్వే వల్ల ఏమైనా ఇబ్బందులు ఉంటున్నాయా అని స్థానికులను అడిగి తెలుసుకోగా.. ఎలాంటి ఇబ్బంది రావడంలేదని అన్ని వివరాలు చెబుతున్నామని తెలిపారు. అనంతరం సర్వే చేసిన ఫారాలను మున్సిపల్ ఆఫీసులో భద్రపరచగా పరిశీలించింది. జిల్లా పరిశ్రమల శాఖ  జాయింట్ డైరెక్టర్ కోటేశ్వరరావు, దేవరకొండ ఆర్డీఓ ఎస్ .రమణారెడ్డి, తహసీల్దార్ సంతోశ్​ కిరణ్, దేవరకొండ మున్సిపల్ చైర్మన్ అలంపల్లి నరసింహ, కమిషనర్ సుదర్శన్ ఉన్నారు.