ఎస్​వీకేఎం స్కూల్​లో చైల్డ్ సైంటిస్టులు.. ప్రాజెక్టులు భేష్

స్టాఫ్​ ఫొటోగ్రాఫర్​, మహబూబ్​నగర్​ వెలుగు : మహబూబ్​నగర్​ జిల్లా జడ్చర్ల మండల పోలేపల్లి సెజ్​ సమీపంలో ఉన్న ఎస్​వీకేఎం స్కూల్​లో రాష్ట్ర స్థాయి సైన్స్​ ఫేర్ మంగళవారం నుంచి ప్రారంభమైంది. సైన్స్​ ఫేర్​కు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి స్టూడెంట్లు హాజరై ప్రాజెక్టులను ప్రదర్శించారు.  చైల్డ్​సైంటిస్టులు ప్రదర్శించిన ప్రాజెక్టులు అబ్బురపరిచాయి.  ఏడు విభాగాల్లో ప్రదర్శించిన ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలను  చైల్డ్​ సైంటిస్టులు తోటి స్టూండెట్లకు వివరిస్తూ అవగాహన కల్పించారు.

 వీటిని చూసేందుకు ఉదయం 10 గంటల నుంచే జిల్లాలోని ఆయా స్కూల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కు  చెందిన స్టూడెంట్లకు స్టాల్స్​ వద్దకు చేరుకొని వాటిని పరిశీలించారు.  అనంతరం వాటి పని తీరు గురించి తెలుసుకున్నారు.  కొన్ని ప్రదర్శనలు చీఫ్​ గెస్టులను ఆకట్టుకోవడంతో వారు చైల్డ్​ సైంటిస్టులను అభినందించారు. ప్రాజెక్టుల్లో  కొన్ని ప్రదర్శనలను చూపరులను ఆలోచింపజేశాయి.