మెదక్, వెలుగు: ఈ నెల 10, 11 తేదీల్లో మెదక్ పట్టణంలోని ఇందిరా గాంధీ స్పోర్ట్స్ స్టేడియంలో స్టేట్ లెవల్మెన్, ఉమెన్అండర్ 23 అథ్లెటిక్ చాంపియన్ షిప్ నిర్వహిస్తున్న ట్టు ఆదివారం జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మధుసూదన్, వెంకటరమణ తెలిపారు.
ఈనెల 6న జిల్లా స్థాయి సెలెక్షన్స్ నిర్వహించనున్నట్టు పేర్కొ న్నారు. రన్స్, జంప్స్, త్రో విభాగాల్లో మెదక్ జిల్లా స్థాయి సెలెక్షన్స్ నిర్వహించి ప్రతిభ చూపిన వారిని స్టేట్ లెవల్ అథ్లెటిక్ పోటీలకు ఎంపిక చేస్తారని తెలిపారు. జిల్లా స్థాయి సెలెక్షన్కు వచ్చే క్రీడాకారులు వచ్చేటప్పుడు వయస్సు ధ్రువీకరణ పత్రం వెంట తీసుకొని రావాలని సూచించారు. ఇతర వివరాలకు 99630 05540 నెంబర్లో సంప్రదించాల ని తెలిపారు.