కొత్త మండలాల ఏర్పాటుతో సంబరాలు

  • యూత్​ కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు 

చేర్యాల, వెలుగు: సిద్దిపేట జిల్లాలోని మద్దూరు నుంచి దూల్మిట్టను వేరు చేసి కొత్త మండలంగా ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో యూత్​కాంగ్రెస్ శ్రేణులు సీఎం రేవంత్​రెడ్డి, జనగామ డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డి ఫొటోలకు క్షీరాభిషేకం చేసి సంబరాలు చేసుకున్నారు. 

వెల్దుర్తి వెలుగు: మాసాయిపేట ను నూతన మండలంగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం గెజిట్ విడుదల చేయడంతో మండల సాధన సమితి ఆధ్వర్యంలో బుధవారం  సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సిద్ధి రాములు గౌడ్ మాట్లాడుతూ..  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 13 గ్రామాలను కలుపుతూ నూతనంగా మాసాయిపేట మండలం ఏర్పాటుచేస్తూ గెజిట్ విడుదల చేసిందన్నారు.

 జిల్లా మంత్రి దామోదర్​ రాజనర్సింహా, ఇంచార్జి మంత్రి కొండా సురేఖ, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ చార్జి  ఆవుల రాజిరెడ్డి కృషితో గెజిట్ విడుదలైందన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్​ డైరెక్టర్ నరసింహులు, నాగరాజు, శ్రీనివాస్ పాల్గొన్నారు.