న్యూఢిల్లీ, వెలుగు : ఫార్ములా – ఈ రేస్ కేసులో తమ వాదనలను కూడా వినాలని సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసును కొట్టివేయాలని కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను మంగళవారం రాష్ట్ర హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. దీంతో ముందు జాగ్రత్తగా ఏసీబీ అప్రమత్తమైంది. రాష్ట్ర హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఒకవేళ కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే.. తమ వాదన కూడా వినాలని మంగళవారం మధ్యాహ్నం(రాష్ట్ర హైకోర్టు తీర్పు వచ్చిన వెంటనే) ఏసీబీ కేవియట్ పిటిషన్ వేసింది. తమ వాదనలు పరిగణనలోకి తీసుకున్న తర్వాతే కేటీఆర్ వేసే పిటిషన్ పై ఉత్తర్వులు వెలువరించాలని పిటిషన్ లో కోరింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం కేవియట్ వేసిన కొద్దిసేపటికే కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు.
సుప్రీం కోర్టులో రాష్ట్ర సర్కారు కేవియట్ పిటిషన్
- హైదరాబాద్
- January 8, 2025
లేటెస్ట్
- స్టీల్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం.. 9 మంది మృతి
- 40 ఫీట్లు మట్టి పోసీ మూసీని కబ్జాచేసే ప్లాన్.. వార్నింగ్ ఇచ్చి మట్టి తీయించిన హైడ్రా
- అధికారికంగా జైపాల్ రెడ్డి జయంతి వేడుకలు..ఏర్పాట్లకు సీఎస్ ఆదేశం
- Mee Ticket : మీ టికెట్ యాప్.. అన్ని రకాల టికెట్ బుక్ చేసుకోవచ్చు
- Tirupati: మనుషులు చచ్చిపోయారు.. మీకు బాధనిపించట్లేదా అంటూ వారిపై పవన్ సీరియస్...
- సంక్రాంతి ఎఫెక్ట్: కిక్కిరిసిన హైదరాబాద్, సికింద్రాబాద్ బస్, రైల్వే స్టేషన్లు
- తెలంగాణలో టూరిస్ట్ స్పాట్స్ అద్భుతం..నాగార్జున స్పెషల్ వీడియో
- Sankranti Rush : విజయవాడ హైవేలో టోల్ గేట్ల దగ్గర అదనపు కౌంటర్లు.. ట్రాఫిక్ జాం లేకుండా ఏర్పాట్లు
- జియో 5.5G లాంచ్ చేసిన రిలయన్స్.. ఇక నుంచి ఆ ఫోన్లలో సూపర్ పాస్ట్ ఇంటర్నెట్..
- Kidney Care: కిడ్నీ రోగులు ఈ మందులు వాడొద్దు.. గుజరాత్ కంపెనీపై తెలంగాణలో కేసు.