స్టూడెంట్లకు క్వాలిటీ ఫుడ్‌‌ అందించాలి: స్టేట్‌‌ ఫుడ్‌‌ కమిషన్ చైర్మన్ శ్రీనివాస్‌‌రెడ్డి

సిద్దిపేట రూరల్‌‌, వెలుగు : అన్ని వర్గాల ప్రజలకు నాణ్యమైన పౌష్టికాహారం అందేలా చూడాలని స్టేట్‌‌ ఫుడ్‌‌ కమిషన్‌‌ చైర్మన్‌‌ శ్రీనివాస్‌‌రెడ్డి సూచించారు. సిద్దిపేట అర్బన్‌‌ మండలంలోని కేజీబీవీ, సోషల్‌‌ వెల్ఫేర్‌‌ బాలికల గురుకులం, చిన్నకోడూరు జడ్పీ హైస్కూల్‌‌ను శనివారం సందర్శించి, స్టూడెంట్లకు ఇస్తున్న ఆహారాన్ని తనిఖీ చేశారు. స్టూడెంట్లతో మాట్లాడి ఫుడ్‌‌ క్వాలిటీని అడిగి తెలుసుకున్నారు. 

అనంతరం చిన్నకోడూరులోని నాలుగో నంబర్‌‌ అంగన్‌‌వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసి చిన్నారులు, గర్భిణులకు అందిస్తున్న ఆహారాన్ని పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్‌‌లో నిర్వహించిన రివ్యూలో శ్రీనివాస్‌‌రెడ్డి మాట్లాడారు. సర్కార్‌‌ స్కూళ్లతో పాటు, అన్ని సంక్షేమ హాస్టళ్లలో మెనూ ప్రకారం, క్వాలిటీ భోజనం అందించాలని సూచించారు. 

స్టూడెంట్లకు ప్రతి మూడు నెలలకు ఒకసారి బ్లడ్‌‌ టెస్టుల్‌‌ చేయించి, రక్తం తక్కువగా ఉన్న వారికి పౌష్టికాహారం అందించాలని సూచించారు. ఆయన వెంట కలెక్టర్ ఎం. మనుచౌదరి, అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్‌‌రెడ్డి, డీఆర్డీవో జయదేవ్, సివిల్‌‌ సప్లై ఆఫీసర్‌‌ తనూజ, మేనేజర్‌‌ ప్రవీణ్, డీఈవో శ్రీనివాస్‌‌రెడ్డి, డీడబ్ల్యూవో శారద పాల్గొన్నారు.