స్టూడెంట్స్​కు పౌష్టికాహారం అందించాలి : రాష్ట్ర విద్యా కమిషన్ మెంబర్ జ్యోత్స్న

కౌడిపల్లి, వెలుగు: ప్రభుత్వ స్కూళ్లలో చదివే స్టూడెంట్స్​కు పౌష్టికాహారాన్ని అందించాలని తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషన్ మెంబర్  జ్యోత్స్న అన్నారు. మంగళవారం మండలంలోని కొట్టాల జడ్పీ హై స్కూల్​, తునికి మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల స్కూల్​ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం స్టూడెంట్స్​కు పెట్టే మధ్యాహ్న భోజనం, డైనింగ్ హాల్, వంటగది, కూరగాయలు, స్నాక్స్,  సరుకులు, మెనూ రికార్డును తనిఖీ చేశారు. స్టూడెంట్స్​ను టీచర్లు అర్థమయ్యే విధంగా పాఠాలు బోధిస్తున్నారా లేదా అడిగి తెలుసుకున్నారు. స్కూల్​, హాస్టల్ పరిసరాలు తిరిగి పరిశుభ్రమైన వాతావరణం ఉండాలని సిబ్బందికి సూచించారు. ఆమె వెంట డీఈవో రాధా కిషన్, ఎంఈవో బాలరాజ్, తునికి ఎంజేపీ ప్రిన్సిపాల్ హరిబాబు, వార్డెన్ లక్ష్మణ్ ఉన్నారు.

తూప్రాన్ : హాస్టల్స్​లో ఉండి చదువుకునే స్టూడెంట్స్​కు నాణ్యమైన భోజనం పెట్టాలని రాష్ట్ర విద్యా కమిషన్ సభ్యురాలు జోత్స్న సూచించారు. తూప్రాన్ మున్సిపల్ పరిధి అల్లాపూర్ శివారులో టోల్ గేట్ వద్ద ఉన్న గురుకుల స్కూల్​ ను  ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పిల్లలకు వడ్డించే ఆహార పదార్థాలు తాజాగా ఉండేలా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. ఆమె వెంట  డీఈవో రాధాకిషన్, ప్రిన్సిపాల్ మురళి ఉన్నారు.