- రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి
జైపూర్(భీమారం), వెలుగు: విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దని రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి టీచర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం, భీమారం జడ్పీ హైస్కూళ్లు, కోటపల్లి కేజీబీవీ, మోడల్ స్కూల్ ను డీఈవో యాదయ్యతో కలిసి విజిట్ చేశారు. భీమారం హైస్కూల్లో 6వ తరగతి విద్యార్థులు తెలుగు పదాలను చదవలేకపోవడంతో ఏం చదువు చెబుతున్నారని ఫైర్ అయ్యారు. 5వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం చదివిన స్టూడెంట్లకు 6వ తరగతి నుంచి తెలుగు మీడియంలో చేర్పించి క్లాసులు చెప్పడం ఏమిటన్నారు. ఆఫీసుకు పరిమితం కాకుండా స్కూళ్లను విజిట్ చేయాలని డీఈవోను ఆదేశించారు. కిచెన్‌ను పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.