నవంబర్ 10న సొంత జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నవంబర్ 10న (రేపు) మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. రేవంత్ రెడ్డి ఆదివారం కురుమూర్తి స్వామిని దర్శించుకోనున్నారు. అధికారులు సీఎం పర్యటనకు అన్నీ ఏర్పాట్లు చేశారు. కురుమూర్తి స్వామిని దర్శించుకోవడానికి సీఎం రేవంత్ రెడ్డి కురుమూర్తి ఘాట్ రోడ్డు ఎలివేటెడ్ కారిడార్ కు శంకుస్థాపన చేస్తారు. ఈమేరకు సీఎం పర్యటన షెడ్యూల్ ను మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విడుదల చేశారు. ఉదయం పది గంటటకు బేగంపేట్ ఎయిర్ పోర్ట్ నుంచి బయలుదేరి.. 11 గంటలకు కురుమూర్తి ఆలయానికి చేరుకుంటారు.